Shani: శని దేవుడిని శనివారం ప్రసన్నం చేసుకునే ఉపాయాలివీ..

మీరు శని యొక్క అశుభ ప్రభావాల నుంచి విముక్తి పొందాలని భావిస్తున్నారా? శనిదేవుని అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారా? అయితే శనివారం నాడు ఈ ప్రభావవంతమైన..

Shani : మీరు శని యొక్క అశుభ ప్రభావాల నుంచి విముక్తి పొందాలని భావిస్తున్నారా? శనిదేవుని (Shani) అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారా? అయితే శనివారం నాడు ఈ ప్రభావవంతమైన పరిహారాలు చేయండి. ఆనందం, శ్రేయస్సు మీ చేరువకు వస్తుంది. అన్ని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి.

ప్రతి వారంలోని 7 రోజులు 7 గ్రహాలకు అంకితం చేయబడ్డాయి. ఒక్కో రోజు ఒక్కో గ్రహంచే పాలించబడుతుంది. శనివారం శని గ్రహానికి అంకితం చేయబడింది.  శనివారం నాడు శని దేవుడిని పూజించి, కొన్ని చర్యలు తీసుకుంటే అన్ని రకాల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జ్యోతిషశాస్త్రంలోశని గ్రహాన్ని న్యాయం, ఫలితాలను ఇచ్చేదిగా పరిగణిస్తారు. శని దేవుడు ప్రతి ఒక్కరికి వారి కర్మల ఆధారంగా మాత్రమే ఫలాలను ఇస్తాడు.  హనుమంతుడిని, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం అనేది ఉత్తమమైన రోజు.

ఆవ నూనె, నువ్వుల నూనె:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఆవ నూనె చాలా ఇష్టం.  శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కూడా ప్రయోజనకరం. ఎవరి జాతకంలో నైనా శని దోషం, సాడే సాతీ ఉంటే శని దేవుడిని పూజించాలి. శనివారాలలో నూనె సమర్పించడం ద్వారా ఈ దోషాలు తొలగి పోతాయని నమ్ముతారు.  దీని వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోయి మీరు విజయం సాధిస్తారు.

శమీ మొక్క:

శమీ మొక్క చాలా పవిత్రమైనది.  శమీ మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి. ముఖ్యంగా శనివారం నాడు శమీ మొక్కను పూజిస్తే శివుడు మరియు శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. షమీ మొక్క ఇంట్లో ఉంటే.. ఆ ప్రాంతం చుట్టూ ఉండే రకాల ప్రతికూల శక్తులు పారిపోతాయి. శనివారం నాడు శమీ మొక్కకు పూజ చేసి, దాని కింది భాగంలో ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాహంలో జాప్యం లేదా ఆటంకాలు ఎదురైన వారు తప్పనిసరిగా శమీ మొక్కను పూజించాలి.

నీలిరంగు పువ్వులు:

శని దేవుడికి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే శనివారం నీలిరంగు పువ్వులు శని దేవుడికి తప్పక సమర్పించాలి. సాధా రణంగా నీలం రంగులోని  అపరాజిత అనే పుష్పంను శని దేవుడికి సమర్పిస్తుంటారు.

రావి చెట్టు:

శనిదేవుడు శనివారాల్లో రావి చెట్టుపైకి వచ్చి కూర్చుంటాడు. ఈ కారణంగా మీకు శనిదేవుని అనుగ్రహం కావాలంటే శనివారం నాడు రావి చెట్టులో దీపం వెలిగించి, నీరు పెట్టాలి.  శనివారం సాయంత్రం రావి చెట్టును పూజించి, ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శనిదోషం తొలగిపోతుంది.

పేదలకు సాయం:

పేదలు, నిస్సహాయులకు సహాయం చేసే వ్యక్తులను చూసి శని దేవుడు సంతోషిస్తాడు.  శనివారం నాడు శని దేవుడిని పూజించి, అవసరమైన వారికి దానం ఇస్తే శని దేవుడు త్వరగా ప్రసన్నం అవుతాడు.

శని (Shani) స్తోత్రం, చాలీసా పఠనం:

శనివారం నాడు శని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి శని స్తోత్రానికి సంబంధించిన మంత్రాలను తప్పనిసరిగా పఠించాలి. ఈ మంత్రాలు “ఓం ప్రమ్ ప్రిం ప్రౌం సః శనిచార్యాయ నమః మరియు ఓం శం శనిచార్యై నమః”. ఇక శనివారం నాడు హనుమంతుడిని పూజించిన వారికి శనిదేవుడు సదా ప్రసన్నుడై ఉంటాడు. శని పూజతో పాటు హనుమంతుడిని కూడా పూజించాలి. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల హనుమాన్‌జీతో పాటు శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి.

Also Read:  Navratri Special: మాతా చంద్రఘంట ఎవరు?  త్రిమూర్తుల కోపం నుంచి ఉద్భవించిన దివ్యతేజం విశేషాలివీ