Turmeric: మహిళలు కాళ్లకు పసుపు రాసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి?

పసుపు అల్లం జాతికి చెందిన మొక్క.పసుపును మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పసుపుతో అనేక ఆరోగ్య

  • Written By:
  • Publish Date - January 25, 2023 / 06:00 AM IST

పసుపు అల్లం జాతికి చెందిన మొక్క.పసుపును మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పసుపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపును ఆయుర్వేద ఔషధాలలో వాడుతారు. పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. అయితే పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. ఇకపోతే భారతదేశంలో హిందువులు మరి ముఖ్యంగా స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాళ్లకు పసుపు రాయడంలో కొన్ని రకాల పరిహారాలు నియమాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది చేతిలో కొంచెం పసుపు తీసుకొని కొంచెం నీళ్లు తీసుకొని పాదాలకు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే చేతిలోకి పసుపు తీసుకొని నీటితో కలిపినప్పుడు సరిగ్గా కలవదు. కొనిపించాల పొడిగా ఉంటుంది. అలాంటి పసుపు పాదాలకు పూసుకుంటే పాదాలకు కొన్నిచోట్ల గ్యాప్ వస్తుంది. దీని వలన అనేక దోషాలు కలుగుతాయి. కాబట్టి అందుకోసం పసుపు, నీరు ఒక గిన్నెలో తీసుకొని బాగా కలిపి తర్వాత నేలపై ఒక బట్టను వేయాలి. దానిపై పాదాలు పెట్టి అప్పుడు మాత్రమే పసుపు పెట్టుకొవాలి. అదే విధంగా ముత్తైదువలకు కూడా పాదాలకు పసుపు పెట్టేటప్పుడు ఇదే పద్ధతని పాటించడం మంచిది.

అయితే చాలామంది మంది పసుపును సరిగ్గా కలపరు. దీంతో అది ఉండలుగానే ఉంటుంది. దీంతో చాలా చోట్ల సరిగ్గా అంటు కోదు. దీంతో కూడా అనేక రకాల దోషాలు వస్తాయి. మరికొంత మంది పాదాలకు పెట్టిన పసుపుని ఇంట్లోని గడపలకు పెట్టడానికి ఉపయోగిస్తుంటారు. ఇది చాలా పాపం. గడపలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఇలా చేస్తే అనేక దరిద్రాలు చుట్టుకుంటాయి. అలాగే పాదాలకు ఉపయోగించిన పసుపును వేరే దానికి ఉపయోగించ కూడదు. అలాగే ఏ రోజుకు కలిపిన పసుపు అదే రోజున అయిపోయేలా చూసుకొవాలి. కానీ చాలామంది మహిళలు మిగిలింది కదా అని మరుసటి రోజు లేదా మరో కార్యక్రమానికి పసుపును ఉపయోగిస్తుఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ పసుపు మిగిలి పోయి ఉంటే ఆ పసుపలో నీళ్లను పోసి ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయాలి. ఇవి పాటించుకుంటూ పసుపు రాసుకొవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి.