Tirumala : తిరుమల చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రదేశాలు ఎంతబాగుంటాయో..!!

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 02:08 PM IST

తిరుమల (Tirumala ) క్షేత్రం పొడుగుతా భక్తులంతా కిటకిటలాడుతుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు ప్రపంచం లో ఉన్న చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇక సినీ , రాజకీయ ప్రముఖులైతే ఏడాదిలో దాదాపు ఐదు , ఆరు సార్లైనా వెంకన్నను దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు.

అయితే చాలామంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని వెళ్తారు..కానీ తిరుమల చుట్టూ ఉన్న చూడాల్సిన ప్రదేశాలను (Tourist Places to Visit in Tirumala) మాత్రం చూడకుండా వెళ్తుంటారు. కొంతమంది చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయని తెలియక వెళ్తే…మరికొంతమంది సమయం లేక వెళ్తుంటారు. కానీ ఒక్కసారైనా ఆ ప్రదేశాలను చూస్తే మనసుకు ఎంతో హాయి కలుగుతుందని అక్కడి స్థానికులు చెపుతున్నారు.

మరి ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం కాస్త దూరంగా వుండేదేమిటంటే శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం.దీనినే మనం శ్రీనివాస మంగాపురం అని పిలుస్తాం.ఈ శ్రీనివాస మంగాపురం చేరాలంటే మీకు కపిలతీర్థం నుంచి డైరెక్ట్ గా బస్సులుంటాయి.లేదా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్సులుంటాయి.

* కాణిపాకం

సుమారు గంటన్నరలో మీరు కాణిపాకం వెళ్లి రావచ్చును.వరసిద్ధి వినాయకస్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభు.కాణిపాకం నుంచి 15కి.మీ ల దూరంలో అర్ధగిరి వుంది.

* అర్ధగిరి

ఈ అర్ధగిరి ఆంజనేయస్వామి టెంపుల్ వుంది ఇక్కడ. రామాయణ కాలంలో ఆంజనేయస్వామి సంజీవపర్వతం తీసుకొస్తున్న టైంలో కొంచెం కొండ పై నుంచి కింద పడుతుందన్నమాట. ఆ పడిన కొంచెం కొండనే ఇప్పుడు అర్ధగిరి అంటాం. వనమూలికలతో కూడిన తీర్థం స్వీకరించాలి ఇక్కడ.బాటిల్ తో తీర్థం తీసుకుని వెళ్ళొచ్చు.

* శ్రీపురం గోల్డెన్ టెంపుల్

ఇక్కడికి చిన్న జీపుల ద్వారా వెళ్ళొచ్చు.లేదా కొండపైనుంచి శ్రీపురానికి డైరెక్ట్ బస్సులుంటాయి.

* శ్రీకాళహస్తి

కాణిపాకం తిరపతికి లెఫ్ట్ సైడ్ వుంటుంది.కాళహస్తి రైట్ సైడ్ వుంటుంది.శ్రీకాళహస్తి టెంపుల్ కి ఫ్రీ బస్సులు కూడా వుంటాయి.దర్శనం చేసుకుని బయట రోడ్డు మీదికొస్తే తిరపతి బస్సులుంటాయి.

* ఆకాశగంగ తీర్ధం :

ప్రధాన ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగ జలపాతం ఉంటుంది. ఏడాది పొడవునా కొండపై నుంచి ఈ జలపాతం పడుతూ భక్తుల్లో మతపరమైన విశ్వాసాన్ని నింపుతుంది. జలపాతానికి సమీపంలో ఉండే దేవీ మాత ఆలయంలో భక్తులు పూజలు చేసుకోవచ్చు. ఋతుపవనాల సమయంలో ఆకాశగంగ అందాలు మరింత శోభతో కనిపిస్తాయి.

* శిలాతోరణం :

సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా.. చారిత్రక వారసత్వ సంపదగా ‘శిలాతోరణం’కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తిరుమలకు 11 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. పేరుకు తగ్గట్టే శిలలతో సహజంగా ఏర్పడిన ఈ నిర్మాణం టూరిస్టుల్లో ఆశ్చర్యాన్ని నింపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏర్పడినవి కేవలం మూడే ఉంటే అందులో తిరుమలలో ఉన్న శిలాతోరణం ఒకటి కావడం విశేషం.

* పద్మావతి అమ్మవారి దేవాలయం :

ప్రధాన నగరం నుంచి ఒక కిలోమీటరు దూరంలో పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. తిరుపతిలోని పవిత్రమైన నిర్మాణాల్లో ఈ ఆలయం ఒకటి. భగవంతునికి సంబంధించి ఎన్నో విశేషమైన ఇతిహాసాలకు, కధలకు ఇది నివాసం వంటిది.

* గోవిందరాజస్వామి ఆలయం :

జిల్లాలోనే అతిపెద్ద దేవాలయ సముదాయంగా, వైష్ణవ పుణ్యక్షేత్రంగా 12వ శతాబ్ధంలో రామానుజాచార్యచే ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో విష్ణువును గోవిందరాజస్వామి అని పిలుస్తారు. అందమైన సాంప్రదాయ ద్రావిడ నిర్మాణం, దాని యొక్క గొప్ప సంస్కృతి ప్రతి ఏటా అధిక సంఖ్యలో టూరిస్టులను ఆకట్టుకుంటుంది. తిరుపతిలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి.

* వరాహస్వామి ఆలయం:

తిరుపతి ప్రధాన నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో వరాహస్వామి ఆలయం ఉంటుంది. వెంకటేశ్వరస్వామిని దర్శించే ముందు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించాలి. దీని వెనుక మూలాలను పరిశీలిస్తే.. వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడుకొండలు వరాహస్వామికి చెందినవి. ఈ కొండలను వెంకటేశ్వరుడికి అప్పగించేందుకు షరతుగా తనకు కూడా సమానంగా పూజలు జరగాలని వరాహస్వామి కోరినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ విన్నపం మేరకు భక్తులు తనను దర్శించే ముందు వరాహస్వామిని దర్శించాలని వెంకటేశ్వరుడు చెప్పినట్లు కధనం. కాబట్టి తిరుపతికి వెళ్ళిన వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ప్రముఖమైనది.

* తుంబురు తీర్ధం :

తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో రమణీయమైన ప్రకృతి మధ్య నెలకొన్న పవిత్రమైన సరస్సు తుంబురు తీర్ధం. ఈ నీటికి అద్వితీయమైన శక్తులు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ నీరు పాపాలను తొలగించడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించేందుకు సహకరిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి సహజ అందాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.

* కపిల తీర్ధం :

తిరుమల కొండపై మెట్ల బాటలో ప్రముఖ శైవ క్షేత్రం కపిల తీర్ధం ఉంటుంది. అద్భుతమైన ద్రావిడుల నిర్మాణశైలి ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. కపిల మునిచే ప్రతిష్టించబడిన ఇక్కడి శివలింగాన్ని కపిలేశ్వరుడు అని పిలుస్తారు. జలపాతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

* జింకల పార్కు:

తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్లే దారిలో జింకల పార్కు ఉంటుంది. వివిధ జాతులకు చెందిన జింకలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. జంతు ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. ఇక్కడ జింకలకు ఆహారాన్ని స్వయంగా అందించడమే కాకుండా పచ్చని వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.

* శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్:

తిరుపతి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో 350 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. అందమైన జలపాతాలకు, అపారమైన జీవవైవిధ్యానికి ఇది కేరాఫ్ అడ్రెస్.

* తలకోన జలపాతం :

శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ కు సమీపంలో ఉండే అద్భుతమైన జలపాతం ‘తలకోన’. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే చెబుతారు. ఈ ప్రాంతానికి ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా కూడా పేరుంది.

* చంద్రగిరి ప్యాలెస్ & కోట:

తిరుపతికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. విజయనగరరాజ్యంలో భాగంగా ఉండే యాదవ నాయుడు రాజులు 11వ శతాబ్ధంలో ఈ స్మారకాలను నిర్మించినట్లు చెబుతారు. విజయనగర నిర్మాణశైలికి ఈ ప్యాలెస్, కోటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక్కడి విలువైన చరిత్రకు, వారసత్వానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.

* బేడి ఆంజనేయస్వామి ఆలయం:

ఇది తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒంటె కోసం వెదుకుతున్న హనుమంతుణ్ణి ఆయన తల్లి కట్టేసి ఆకాశగంగకు తీసుకువెళ్లినట్లు పురాణ కధనం. అందుకే ఇక్కడి హనుమంతుణ్ణి బేడి ఆంజనేయస్వామిగా పిలుస్తారని చెబుతారు. హనుమంతుడు ఈ రోజుకూ ఆ ప్రదేశంలో నిలబడతాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

* శ్రీవారి మ్యూజియం:

తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మ్యూజియం ఉంది. హిందూ మత చరిత్రకు ఇది ఒక తార్కాణంగా నిలుస్తుంది. ప్రాచీన చరిత్ర, దేవాలయాల నిర్మాణశైలి, విగ్రహాలు, చిత్రాలు, గ్రంధాలు ఇలా ఎన్నో అపారమైన మతపరమైన విజ్ఞానాన్ని టూరిస్టులకు ఈ మ్యూజియం అందిస్తుంది.

* వైకుంఠ తీర్ధం:

తిరుపతికి 112 కిలోమీటర్ల దూరంలో వైకుంఠ తీర్ధం ఉంది. పవిత్రమైన ఇక్కడి జలపాతానికి రామాయణ కాలం నాటితో సంబంధం ఉందని నమ్ముతారు. రాముడికి చెందిన వానర సేన ఈ తీర్ధం వద్దే ఉండేదని కధనం. ఇక్కడి పవిత్ర జలంలో మునక వేయడం ద్వారా అదృష్టం, మంచి భవిష్యత్తుతో పాటు పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Follow us