ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. మరి ఎప్పటిలాగే ఈ ఏడాది అనగా 2024 మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది. ఈ ఏడాది మొత్తం కలిపి ఎన్ని గ్రహాలు వచ్చాయి అన్న వివరాల్లోకి వెళితే.. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్దిష్ట సమయంలో జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం 2024ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం, దక్షిణ పసిఫిక్ మీదుగా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించే ముందు మెక్సికో పసిఫిక్ తీరానికి చేరుకుంటుంది. ఖగోళంలో ఈ 2024 మొత్తంలో 5 గ్రహణాలు సంభవించనున్నాయి.
ఇందులో 2 సూర్య గ్రహణాలు, 3 చంద్ర గ్రహణాలు. వచ్చే ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణంగా పిలుస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అంతేకాదు సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, భూమికి సూర్యుడు మధ్యగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గత 7ఏళ్లలో ఇలాంటి సూర్యగ్రహణం సంభవించనుడటం రెండోసారి కానుంది. గతంలో 2017 ఆగస్టు 21న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది.
రాబోయే సంపూర్ణ సూర్య గ్రహణం 2024 సంవత్సరంలో అతిపెద్ద ఖగోళ సంఘటనగా భావిస్తున్నారు. కాగా మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరగబోతోంది. ఈ అద్భుతమైన ఖగోళ దృగ్విషయాన్ని చూసే ఈ అరుదైన అవకాశం కోసం ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే 2024 మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం లేదా సూర్య గ్రహణం మీనరాశిలో చైత్ర మాసంలో జరగనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9, 2024న తెల్లవారు జామున 2:22 గంటలకు ముగుస్తుంది. మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లో కనిపిస్తుందా అన్న విషయానికి వస్తే.. భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. దేశంలోని ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు.