Puri Jagannath Rath Yatra : ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర రేపటి (జులై 7) నుంచి మొదలు కానుంది. భక్తులు తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక సంబరం ఈ వేడుక. ఏటా ఆషాఢ మాసంలో ఈ రథయాత్రను నిర్వహిస్తారు. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సాధారణంగానైతే పూరీ జగన్నాథుడి నవయవ్వన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. అయితే ఈసారి మూడు ఉత్సవాలు కూడా ఒకే రోజు(జులై 7న) జరగనున్నాయి.ఈవిధంగా ఉత్సవాలను నిర్వహించడం దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. చివరిసారిగా 1971లో నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు చేశారు.రథయాత్ర కోసం ఈరోజు అర్థరాత్రి నుంచే గర్భగుడిలో జగన్నాధ, బలభద్ర, సుభద్రకు ప్రత్యేక సేవలు మొదలువుతాయి. తెల్లవారు జామున నవయవ్వన అవతార అలంకరణం, ఆ తర్వాత నేత్రోత్సవం, గోప్య సేవలు నిర్వహిస్తారు. తదుపరిగా విగ్రహాలను రథం వద్దకు తీసుకొస్తారు. రేపు సాయంత్రం పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది.
We’re now on WhatsApp. Click to Join
3 రథాలు..
పూరీ జగన్నాథస్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు.. 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచాదేవి ఆలయం వద్దకు చేరుకొని ఆగిపోతాయి. రథాలు అక్కడ తొమ్మిది రోజులపాటు ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అనంతరం తిరుగు పయనమై జగన్నాథ ఆలయానికి చేరుకుంటాయి. ఆ తర్వాత రథాల్లోని విగ్రహాలను తీసుకెళ్లి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు. జగన్నాథుడు ఆలయానికి చేరుకున్న తర్వాత జరిగే ఉత్సవాన్ని సునా బేషా అని పిలుస్తారు. అంటే విగ్రహాలను బంగారంతో ముంచెత్తుతారు. ఇందుకోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలు ఉపయోగిస్తారు. దీంతో ఉత్సవం ముగుస్తుంది.
Also Read :Amaravati ORR : అమరావతికి గుడ్ న్యూస్.. ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రథయాత్ర ప్రత్యేకతలు..
1078 సంవత్సరంలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ Odishaలో ఈ ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో ఆలయం పనులు పూర్తయ్యాయి. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారు. ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాన్ని కదపరు. వేడుకలు, రథయాత్రల సమయంలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే బయటకు తీసుకొస్తారు.కానీ పూరీ జగన్నాథుడి రథయాత్రలో(Puri Jagannath Rath Yatra) గర్భగుడిలో కొలువైన దేవుళ్లనే ఊరేగిస్తారు. పూరీ జగన్నాథుడి కోసం ఏటా కొత్త రథాన్ని తయారు చేస్తారు. కొన్ని నెలల ముందు నుంచే ఈ రథాల తయారీ ప్రక్రియను మొదలుపెడతారు. జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజం, బలరాముడి రథాన్ని తాళధ్వజం, సుభద్ర రథాన్ని దేవదాలన అని పిలుస్తారు.