Diwali: దీపావళి (Diwali) పండుగ అంటే కేవలం టపాసులు, పిండివంటలు మాత్రమే కాదు. ఇది పవిత్రత, సంస్కృతికి ప్రతీక. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆచరించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలు, పద్ధతుల గురించి పండితులు వివరిస్తున్నారు. తెల్లవారుజామునే స్నానం చేయడం నుండి దీపారాధనలో వత్తుల సంఖ్య వరకు ఉన్న విశిష్టతలను తెలుసుకుందాం.
దీపావళి రోజున తెల్లవారుజాము స్నానం
దీపావళి రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పండితుల సూచనల ప్రకారం.. సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలి. ఈ స్నానానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. “నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ రోజున (దీపావళ) చేసే స్నానం వల్ల గంగా స్నాన ఫలం లభిస్తుంది” అని పెద్దలు చెబుతున్నారు. స్నానం పూర్తయిన తర్వాత తెలుపు వస్త్రాలు ధరించి, మినప ఆకు, మినపప్పుతో చేసిన వంటకాలను తినడం శుభకరం. ఈ నియమాలు పాటించడం వల్ల ఏడాది పొడవునా శుభాలు కలుగుతాయని విశ్వాసం.
Also Read: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇటలీలో చిక్కుకున్న ప్రయాణీకులు!
దీపారాధనలో ఐదు వత్తుల ప్రాధాన్యం
దీపావళి దీపారాధనలో ఉపయోగించే వత్తుల సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంటి గృహిణి స్వయంగా దీపం వెలిగించేటప్పుడు కుందిలో 5 వత్తులు ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఐదు వత్తులు కుటుంబంలోని ఐదు ముఖ్య అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయని చెబుతున్నారు.
- మొదటి వత్తి: భర్త, సంతానం క్షేమం కోసం.
- రెండో వత్తి: అత్తమామల శ్రేయస్సు కోసం.
- మూడో వత్తి: తోబుట్టువుల క్షేమం కోసం ఉద్దేశించినవి.
- నాల్గో వత్తి: గౌరవం, ధర్మ వృద్ధిని సూచిస్తుంది.
- ఐదో వత్తి: వంశాభివృద్ధిని సూచిస్తుంది.
దీపాలు పెట్టేటప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు
దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తెలియక చేసే చిన్న పొరపాట్లు కూడా అశుభాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.
- తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించకూడదు.
- బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు.
- దీపం వెలిగించే సమయంలో మౌనం పాటించాలి.
- జ్యోతిని ఏక హారతితో (ఒకే అగ్గిపుల్ల లేదా వెలిగించిన వత్తితో) వెలిగించడం ఉత్తమం.
- ఒకే వత్తిని ఉపయోగించకూడదు. రెండు లేదా మూడు వత్తులతో దీపాలు పెట్టడం శుభకరం.