Site icon HashtagU Telugu

Today Horoscope : ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి…!!

Zodiac

Zodiac

ఈరోజు అనగా ఆదివారం 02 అక్టోబర్ రాశిఫలాలు ఎవరి అనుకూలంగా ఉన్నాయి. ఏ రాశులవారికి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. జ్యోతిష్య పండితులు చెబుతున్న సలహాలు ఏంటి. ఈ వివరాలను ఈ రోజు రాశిఫలాల్లో తెలుసుకుందాం.

మేషం
ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలించడంతోపాటుగా ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం
గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారపరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం
ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు.

కర్కాటకం
బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి..

సింహం
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరొందిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు. గృహ నిర్మాణం కార్యరూపం దాలుస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

తుల
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి.

ధనస్సు
దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి.

మకరం
ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.

కుంభం
ఉద్యోగాలలో వ్యాపారస్తుల అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు.

మీనం
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.

Exit mobile version