Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి. హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక విజయ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో మనకు తెలుసు. శ్రీ మహా విష్ణువుకు విజయ ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. ఇవాళ విష్ణువును నిష్ఠతో పూజిస్తే విజయాలు లభిస్తాయి. ఈ రోజున విజయ ఏకాదశి తిథి ఉదయం 6:33 గంటలకు ప్రారంభమై మార్చి 7న తెల్లవారుజామున 4:16 గంటల వరకు కొనసాగుతుంది.
We’re now on WhatsApp. Click to Join
రామాయణంతో సంబంధం
- ఈ ఏకాదశికి రామాయణ కాలంతోనూ సంబంధం ఉంది. ఇవాళ ఉపవాసం చేసేవారు అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణుని చెర నుంచి విడిపించడానికి, విజయం సాధించడానికి ఉపవాసం చేశాడంటే విజయ ఏకాదశి ప్రాధాన్యత ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
- విజయ ఏకాదశి (Vijaya Ekadashi) రోజున స్నానానికి వాడే నీటిలో ఉసిరికాయ వేసుకుంటే పుణ్యం పెరుగుతుంది.
- విజయ ఏకాదశి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు చదువులో, వ్యాపారాలలో, జీవిత లక్ష్యాలలో విజయం తప్పక సాధిస్తారు.
- విజయ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల పాపాలు పోయి, పుణ్యం వస్తుంది.
- విజయ ఏకాదశి వ్రతం భక్తులకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది.
- విజయ ఏకాదశి రోజు విష్ణువును పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.అన్ని పనులూ విజయవంతంగా చేయగలుగుతారు.
Also Read : Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురాకండి.. తెచ్చారో రోడ్డు పాలే?
- జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టి ఈ రోజు పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించండి. కానీ ఏకాదశి రోజున వాటిని సేకరించకూడదు. అంతకుముందు రోజు మాత్రమే వాటిని తీసుకోవాలి. పూజ సమయంలో తులసి ఆకులను సమర్పించేటప్పుడు, మీ కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించండి.
- ఈ రోజున పదకొండు అరటిపండ్లు, లడ్డూలు, ఎర్రటి పువ్వులు, పదకొండు అగరబత్తులు, పదకొండు దీపాలు, పదకొండు ఖర్జూరాలు, పదకొండు బాదంపప్పులను కూడా దేవునికి సమర్పించాలి.
- చాలా మంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున మామిడి ఆకులను కలశంపై ఉంచాలి. దాని మీద బార్లీ నింపిన కుండ పెట్టాలి. 11 ఎర్రటి పూలు, 11 పండ్లు, స్వీట్లు సమర్పించి దీపం వెలిగించాలి. దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.