Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు

ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధుని జన్మదినం సందర్భంగా ఈరోజు బుద్ధ పూర్ణిమ వేడుకల నిర్వహిస్తారు. 

Published By: HashtagU Telugu Desk
Buddha Purnima 2024

Buddha Purnima 2024

Buddha Purnima 2024 :  ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధుని జన్మదినం సందర్భంగా ఈరోజు బుద్ధ పూర్ణిమ వేడుకల నిర్వహిస్తారు.  మనదేశంతో పాటు శ్రీలంక, థాయ్‌లాండ్, బర్మా, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి చాలా ప్రపంచదేశాల్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బుద్ధుడి జీవితంలో వైశాఖ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆయన జన్మించింది వైశాఖ పౌర్ణమి రోజే. ఈయన తల్లిదండ్రుల పేర్లు శుద్ధోధనుడు (కపిలవస్తు రాజు), మహామాయ. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్ధుడు. యవ్వనం వచ్చాక ఓ వైశాఖ పూర్ణిమనాడు బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. దీంతో సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. బుద్ధుడి తల్లి చిన్నతనంలోనే మరణించగా గౌతమి అనే స్త్రీ పెంచింది. అందుకే ఆయనకు గౌతముడు అనే పేరు కూడా వచ్చింది. ఇదే వైశాఖ పూర్ణిమనాడు బుద్దుడు నిర్యాణం చెందారు.

We’re now on WhatsApp. Click to Join

విగ్రహారాధనను బుద్ధుడు వ్యతిరేకించేవారు. అందుకే  ఓసారి భక్తులు  తన వద్దకు తెచ్చిన పూలతో బోధి వృక్షానికి పూజలు చేయమని సూచించారు. బోధి వృక్షంతో బుద్ధుడికి స్పెషల్ అనుబంధం ఉంది. బుద్ధుడు యవ్వనంలో మానవుని కష్టాలకు కారణాన్ని శోధిస్తూ చివరకు గయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందుతాడు. కోరికలే మనిషి దుఃఖానికి కారణమనే నగ్నసత్యాన్ని తెలుసుకుంటాడు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున బోధి వృక్షాన్ని పూజిస్తారు. బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షపూజ గొప్పగా జరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు.

Also Read : Ration Cards : త్వరలోనే కొత్త లుక్‌లో రేషన్ కార్డులు

బుద్ధ పూర్ణిమ(Buddha Purnima 2024) రోజు బౌద్ధ మత గురువులకు పువ్వులు, అగరుబత్తులు, దీపాలు వంటివి సమర్పిస్తారు. పువ్వులు విడిపోతాయి. అగరుబత్తీల సువాసన, దీపాల వెలుగులు కొంతసేపటికి కనుమరుగవుతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికే ఇవి గురువులకు సమర్పిస్తారు. బుద్ధ పూర్ణిమ రోజు బౌద్ధాలయాల్లో ఒక పాత్ర నిండుగా నీళ్లు పోసి అందులో పువ్వులు వేసి.. భక్తులను అందులో నీళ్లు పోయడానికి అనుమతిస్తారు. అలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ రోజు మద్యం, మాంసం తినకూడదు. పశువులు, పక్షులు మొదలు పురుగులతో సహా దేన్ని కూడా హింసించకూడదు. పంజరాల్లో బంధించి ఉన్న పక్షులను స్వేచ్ఛగా వదిలి వేయాలి.

Also Read :Aarogyasri : ఆగిపోయిన ‘ఆరోగ్యశ్రీ’.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ సేవలు బంద్

  Last Updated: 22 May 2024, 09:43 AM IST