Today Horoscope : ఆగస్టు 15 మంగళవారం రాశి ఫలితాలు.. వీరు ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి

Today Horoscope : మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి...

Published By: HashtagU Telugu Desk
Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి :

ఈరోజు మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంపరంగా అనుకూలం. చేసే పనులు కలసివచ్చును. రాజకీయ నాయకులకు, స్త్రీలకు కలసివచ్చే రోజు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

 

వృషభ రాశి :

ఈరోజు వృషభ రాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు కలుగును. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. దేవీ ఉపాసన చేయడం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

 

మిథునం :

ఈరోజు మిథునరాశి వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలతో కూడియున్నటువంటి సమయం. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితాలు. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

 

కర్కాటకం :

ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేదు. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికం. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. ఆరోగ్య, కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

 

సింహం :

ఈరోజు సింహరాశిలోని ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. విష్ణు నామస్మరణ వల్ల మంచి జరుగుతుంది.

 

కన్య (Today Horoscope) :

ఈరోజు కన్యారాశి వారికి ఘర్షణలతో కూడిన వాతావరణం ఉంటుంది. ఖర్చులు అధికమగును. అప్పుల బాధలు వేధించును. రైతాంగం వారికి అంత అనుకూలంగా లేదు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

 

తుల :

ఈరోజు తులారాశిలోని స్త్రీలకు కలసివచ్చే రోజు. సౌభాగ్యసిద్ధి ఉంది. ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలం. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

 

వృశ్చికం :

ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలం. మీరు చేసే పనులలో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న సమయానికి పూర్తి చేసెదరు. వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. చంద్ర శ్లోకం చదవాలి.

 

ధనుస్సు :

ఈరోజు ధనుస్సు రాశి వారికి శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రైతాంగం, సినీరంగంవారికి కలసి వచ్చేటటువంటి రోజు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వలిగించాలి.

 

మకరం :

ఈరోజు మకర రాశి వారికి కుబుంబ సభ్యులతో భేదాభిప్రాయములు కలుగు సూచన. మానసిక ఆందోళన, చికాకులు, ఇబ్బందులు కలుగును. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఒత్తిళ్ళు అధికము. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

కుంభం :

ఈరోజు కుంభ రాశి వారికి ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

 

మీనం :

ఈరోజు మీన రాశి వారికి అనుకూలంగా లేదు. అప్పులకు దూరంగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు అధికం. చికాకులు, ఇబ్బందులు ఏర్చడును. రాజకీయ ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సమయానికి ధనము అందదు. గణపతిని ఆరాధించడం మంచిది.

 

గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు / పంచాంగాలు / ఉపన్యాసాలు /నమ్మకాలు / గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

Also Read :   Flowers for Health : ఈ పూలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి తెలుసా..

  Last Updated: 27 Aug 2023, 08:00 AM IST