Site icon HashtagU Telugu

Shani Trayodashi : ఇవాళ శని త్రయోదశి.. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం ఇలా..

Shani Pradosh Vrat 2024

Shani Pradosh Vrat 2024

Shani Trayodashi : ఇవాళ శని త్రయోదశి. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ధన్‌తేరస్ పండుగ ఇవాళ కూడా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12: 35 గంటలకు మొదలైన ధన్‌తేరస్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 1.13 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. ఈవిధంగా రెండు త్రయోదశులు ఒకేరోజు రావడం మంచిదే అని పండితులు చెబుతున్నారు. నవగ్రహ ఆలయాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకుని.. శనికి సంబంధించిన శాంతులు, దానాలు చేస్తే పీడలు, ఈతి బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇవాళ శని త్రయోదశి సందర్భంగా నువ్వులనూనెతో శనీశ్వరుడికి దీపం వెలిగించండి. రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత విరమించాలి. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధనతో శని ప్రభావం తగ్గుతుంది. ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వులనూనె తీసుకోవద్దు.  కాలువలో కానీ.. పారే నదిలో కానీ.. బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు వేసి శనికి నమస్కరించండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం(Shani Trayodashi) శుభప్రదం. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ‘‘నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం!!’’ శ్లోకాన్ని చదవొచ్చు.

Also Read: Gold- Silver: గోల్డ్ కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..!

శనిదేవుడు, యమధర్మరాజు ఇద్దరూ సూర్యుడి కుమారులు. మనిషి చేసే  పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనిదేవుడు లైవ్‌లో నియంత్రిస్తాడు. బతికి ఉండగా మనిషి చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుకొని తీర్పులు ఇస్తే.. మరణానంతరం ఆ పాపపుణ్యాల ఆధారంగా తీర్పులు ఇచ్చేది శని సోదరుడు యమధర్మరాజు. శనిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.