Site icon HashtagU Telugu

Vasthu Tips: ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశపెంచకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా?

Vasthu Tips

Vasthu Tips

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఇంట్లోని దిశల విషయంలో వస్తువుల విషయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను నమ్ముతూ ఉంటారు. వాస్తు ప్రకారంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక ఇబ్బందులకు మానసిక ఇబ్బందులకు దారి తీయవచ్చు. అంతేకాకుండా వాస్తు ప్రకారంగా చేసే పొరపాట్ల వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు కూడా ప్రవేశిస్తాయి. అయితే ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో వేసే రంగులు కూడా వాస్తు శాస్త్రంలోకి వస్తాయి. కొందరు వారికి ఇష్టమైన కలర్స్ వేయించుకుంటే మరికొందరు వాస్తు ప్రకారంగా కలర్స్ వేయించుకుంటూ ఉంటారు.

అయితే ఇంట్లోనే గోడలకు లేత గులాబీ, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగులు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పసుపు, తెలుపు మార్బుల్‌ స్టోన్స్‌ను ఫ్లోర్‌కి వాడితే వాస్తుకు అనుగుణంగా ఉంటుంది. ప్రశాంతంగా నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఇవి చూస్తాయి. దంపతుల మధ్య ఎటు వంటి సమస్యలు రావు. చక్కగా నిద్రపడుతుంది. కొందరు పడకగదిలో నెమలి పించం పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో నెమలి పించాన్ని ఉంచడాన్ని ఎంతో శుభకరంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో ఆనందం, సంపద, మనశ్శాంతి పెరుగుతాయి. నెమలి పించం ఉండటం వల్ల ఇంట్లో ఉండే దోషాలు దూరమవుతాయి. ఈ నెమలి పించాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పులో దిశలో ఏదైనా మూలలో ఉంచండి. బయట నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టాలి. నెమలి పించాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ఇంట్లో పూజా మందిరంలో నెమలి పించాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతి రోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పించంతో గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనలు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పించాన్ని పూజగదిలో తప్పకుండా ఉంచాలి. వాస్తుప్రకారం ఇంట్లో గాని వ్యాపార స్థలాలో గాని ప్రధాన ముఖ ద్వారం వద్ద ఇంట్లో ప్రతికూల, సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. భోజపత్రం పై యంత్రం వ్రాయబడిన గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పాదుకలు గల ఫోటోకు రెండువైపులా నెమలి పించాన్ని ప్రధాన ద్వారం పైన ఏర్పాటు చేసుకోవడం వలన ఇంటిలోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు.

దృష్టి లోపాల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా జీవితంలో ప్రతికూలతను అధిగమించి సానుకూల శక్తిని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే ఎంత పని చేసినా డబ్బు రాకపోయినా అప్పుడు మీరు ఈ పరిహారం పాటించాలి. వ్యాపార సంస్థలలో తప్పకుండా భోజపత్రంపై యంత్రం వ్రాయబడిన గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు గల ఫోటోకు ప్రతి నిత్యం ఎర్రని లేదా పసుపు రంగు గల పూలతో పూజించి దూపమ్ వేస్తూ ఉండడం ద్వారా రోజు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. డబ్బు కొరతనేది రాకుండా చూస్తుంది. ​ప్రతికూల శక్తి దూరమవుతుంది.