Site icon HashtagU Telugu

Shani puja : శనిదేవుడిని ఇలా పూజించండి…మీకు ఎలాంటి సమస్యలుండవు..!!

shani

shani

శనిదేవుడు…ఈ భగవాణుడి పేరు వినగానే ఎన్నో సందేహాలు వస్తుంటాయి. కోపంతో కూడిన రూపాన్ని చూస్తేనే…మనస్సులో భయం మొదలౌతుంది. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడు మానవులకు శుభ, అశుభ ఫలాలను అందిస్తాడని నమ్ముతుంటారు. మనం మంచి పనులు చేస్తే…మంచి ఫలితాలు…చెడు పనులు చేస్తే…చెడు ఫలితాలు పొందుతారు. ఇలాంటివారు శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు. శనిదేవుడిని పూజించేందుకు ఉత్తమమైన రోజు శనివారం. కొన్ని సులభమైన పనుల చేస్తే ఆయన ఆశీర్వాదాలు మనపై ఉండటమై కాదు అన్ని రకాల ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు. అవేంటో చూద్దాం.

1. శనిదోషం పడితే…ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు ఇలాంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు, శత్రువులు పెరుగుతారు, రోగాల బారిన పడతారు…ఇలా ఎన్నో సమస్యలుంటాయి. శనిదోషాన్ని నివారించేందుకు ఉత్తమైనరోజు శనిత్రయోదశి…శనివారం రోజు త్రయోదశి వస్తే దానిని శనిత్రయోదశి అంటారు.
2. శనివారం భజరంగ్ బలికి సింధూరం, మల్లెపూలను సమర్పించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. హనుమాన్ ను పూజించిన వారికి శనిదేవుడి ఇబ్బందులు ఎదుర్కొవల్సిన అవసరం ఉండదని నమ్ముతారు.
3. రావిచెట్టుకు నీరు పోయాలి. రావిచెట్టు చుట్టూ ఏడు ప్రదిక్షణలు చేసి నమస్కరించాలి. శనివారం ఎవరైనా పేదలకు ఆహారం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు. పేదరికం తొలగిపోతుంది.
4. ప్రతిశనివారం నల్లనువ్వులు శనిదేవుడికి సమర్పించాలి. నూనె దానం చేస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. స్నానం చేసి ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖం చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెను దానం చేయాలి.
5. శనిదేవుడికి నీలం రంగుపూలను సమర్పించాలి. శనీశ్వరున్ని పూజించేటప్పుడు ఆయన విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు.
6. ఇక శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే సూర్యాస్తమయం తర్వాత ఏదైనా రావిచెట్టు దగ్గర చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించాలి. రావిచెట్టు లేకపోతే ఏదైనా ఆలయంలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

Exit mobile version