Shani Deepam : సూర్యభగవానుడు, ఛాయాదేవికి కలిగిన కుమారుడే శనీశ్వరుడు. శనీశ్వరుడి సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త, పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర. మనసారా ఆరాధించే భక్తులను శనీశ్వరుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఏలినాటి శనిదోషం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడి మీద శని సంచారం వల్ల శనిదోషం ఏర్పడుతుంది. అందుకే శనివారం రోజు ఆలయాలకు వెళ్లి నవగ్రహాలకు నూనెతో అభిషేకం చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
దీపావళి రోజు ఉదయాన్నే దేవుడి దగ్గర కూర్చుని మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి వస్త్రంతో మూటలా కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. అది అలా పక్కన పెట్టేసి ఉంచాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. దివ్వ కొట్టి ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగించాలి. నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి.
నగరాల్లో ఉన్నవారైతే..
నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనిని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదే. దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం(Shani Deepam) ఉత్తమం.
Also Read: Attack On Pak : పాక్ వైమానిక స్థావరంపై సూసైడ్ ఎటాక్.. ఏమైందంటే ?
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.