Site icon HashtagU Telugu

Vastu Tips : తక్కువ జీతం..అధిక ఖర్చులు..ఈ సమస్య నుంచి బయటపడాలంటే…ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి..!!

Fact Check

Money

లక్ష్మీదేవిని సంపదల దేవత అంటారు. లక్ష్మీదేవిని పూజిస్తే..ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్ముతుంటారు. లక్ష్మీదేవిని పూజించిన వారికి కుబేరుడు, శుక్రుడు కూడా అండగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజించినట్లయితే…డబ్బుకు కొదవ ఉండదు. డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించాలంటే ఈ ఐదు వాస్తు చిట్కాలను ప్రయత్నించి చూడండి.

ఉద్యోగస్తులకు వేతనం పెరగాలంటే:
శుక్రవారం నాడు రావి చెట్టు కింద స్వీట్లు, నీరు ఉంచండి. తర్వాత మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఉద్యోగంలో పురోగతి కోసం ప్రార్థించండి. అంతేకాకుండా కొన్ని రావిచెట్టు మొక్కలను కూడా నాటండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

అప్పుల సమస్య నుంచి ఉపశమనం:
అప్పుల సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంటే…శుక్రవారం వేపమొక్కను ఇంటికి తెచ్చుకోండి. నీటితో శుభ్రంగా కడిగి…ఒక గాజు పాత్రలో ఉప్పు కలపి దానిలో ఉంచండి. అప్పులకు సంబంధించిన సమస్య తొలగిపోతుంది.

వారసత్వ ఆస్తులు పొందాలంటే:
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను దండను సమర్పించండి. నెయ్యి దీపం వెలిగించి…హారతి ఇవ్వండి. చిన్నారులకు కోవా స్వీట్లు దానం చేయండి. మీకు రావాల్సిన వారసత్వ ఆస్తిలో మీరు కొంత భాగాన్ని పొందుతారు.

వ్యాపారంలో అభివ్రుద్ధి:
శుక్రవారంనాడు గులాబీ పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించండి. ప్రతిరోజూ లక్ష్మీదేవికి గులాబీ పరిమళాన్ని సమర్పించండి. ప్రతిరోజూ ఇలా చేశాకే…మీరు పనిపై బయటకు వెళ్లండి. ఈ పరిహారం వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. వ్యాపారస్ధులు తమ కార్యాలయాల్లో గులాబీపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందాలంటే:
శుక్రవారం పేదలకు స్వీట్లు , బట్టలు పంచండి. నీటిలో కొద్దిగా పాలు పోసి చంద్రుడికి ఆర్ఝ్యం వేయండి. ఇలా చేస్తే ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి.

 

 

Exit mobile version