పెళ్లి కావడం లేదా ? వివాహ బంధం తెగిపోతోందా ? “హర్తాళికా తీజ్‌” వేళ ఇలా చేస్తే సరి!!

కొందరికి వయసు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరవు.. ఒక వేళ సంబంధం కుదిరి పెళ్లి జరిగినా , వాళ్ళ దాంపత్య జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురు అవుతాయి.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 08:30 AM IST

కొందరికి వయసు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరవు.. ఒక వేళ సంబంధం కుదిరి పెళ్లి జరిగినా , వాళ్ళ దాంపత్య జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురు అవుతాయి. ఇలాంటి వాళ్ళ కు.. ఇలాంటి సమస్యలకు పరిష్కారాన్ని అందించే మార్గాలు ఒక పండుగలో ఉన్నాయి. అదే..హర్తాళికా తీజ్‌!!
ఆ పండుగ రోజున శివ పార్వతులను, వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.  వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వివాహిత స్త్రీలు హర్తాళికా తీజ్‌ వ్రతాన్ని ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడు కోసం ఈసందర్భంగా పూజలు చేస్తారు.
ఈ రోజున వివాహితులు భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. హర్తాళికా తీజ్‌ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది.

హర్తాళికా తీజ్‌ రోజున..

* పెళ్లికాని యువతులు కోరుకున్న వరుడు రావాలంటే హర్తాళికా తీజ్‌ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున నల్లమట్టితో శివుడి విగ్రహం లేదా శివలింగాన్ని తయారుచేసి పూజించాలి. తర్వాత శివుడికి బిల్వపత్రాలు, అక్షత, గంధం, పూలు మెుదలైన వాటిని సమర్పించి పూజించండి. శివయ్యతోపాటు పార్వతీ, గణేశుడిని పూజించండి. దీంతోపాటు “హే గౌరీ శంకర అర్ధాంగినీ  యత్వం శంకర ప్రియం
తథా మం కురు కల్యాణి కంటకాంత సుదుర్లభమ్” అనే మంత్రాన్ని పఠించండి.

* వివాహిత స్త్రీలు.. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే  ఈరోజు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలి. అంతేకాకుండా పార్వతీ దేవికి ఎరుపు రంగు చున్రీని సమర్పించండి. పూజ సమయంలో ”ఓం గౌరీ శంకరాయ నమః” మంత్రాన్ని జపించండి.

* వైవాహిక బంధం పదేపదే తెగిపోతుంటే.. ఈరోజున కొన్ని ప్రత్యేక ఉపచారాలు చేయాలి.పసుపు వస్త్రాలు ధరించి శివుడి ఆలయానికి వెళ్ళాలి. శివలింగానికి తెలుపు చందనం, నీటితో అభిషేకం చేయించాలి. పార్వతి దేవికి కుంకుమ సమర్పించండి. “ఓ పార్వతీ పతయేనమహ ” మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించిన కుంకుమను ప్రసాదంగా స్వీకరించి రోజూ స్నానము చేశాక సింధూరంగా పెట్టుకోండి. ఫలితంగా దాంపత్య జీవితం ఎంతో బలోపేతం అవుతుంది.

* భార్యాభర్తల మధ్య సమస్యలుంటే ఈరోజున శివ మందిరానికి వెళ్ళాలి. మందిరంలో నెయ్యితో ఒక చతుర్ముఖ దీపాన్ని వెలిగించండి. శివుడికి చందనం, పార్వతీ అమ్మవారికి సింధూరం, ఎరుపు గాజులు సమర్పించండి. ఆ తర్వాత ఆలయంలో కూర్చొని 108 సార్లు ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించండి. అమ్మవారికి సమర్పించిన గాజులను మహిళలు ప్రసాదంలా ఇంటికి తెచ్చుకొని ధరించాలి. పూజా సమయంలో ”దేహి సౌభభం ఆరోగ్య దేహి మే పరమం సుఖం, పుత్ర పౌత్రాది సముద్భావ దేహి మే పరమేశ్వరి” అనే మంత్రాన్ని జపించండి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

* మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండాలంటే.. మీరు పూజ సమయంలో మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శివుడు మంచి ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదిస్తాడు.

* మీరు ఈ రోజు పూజ అయిపోయిన తర్వాత అత్తగారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి. ఆమెకు ఎరుపు రంగు చీర, మేకప్ మెటీరియల్ , హర్తాళికా తీజ్ పూజ నైవేద్యాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది.