Spirituality: ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా.. అయితే ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించాల్సిందే!

కష్టాలతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా, అయితే ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగిస్తే ఆ కష్టాల సమస్యల నుంచి గట్టెక్కడం ఖాయం అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Spirituality

Spirituality

ఎన్ని రకాల పూజలు, పరిహారాలు, దానధర్మాలు చేసినా కూడా కష్టాలు పోవడం లేదా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా, కష్టాల ఊబిలో కూరుకుపోయారా అయితే ఇప్పుడు చెప్పినట్టుగా దిశలో దీపం వెలిగిస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడడం ఖాయం అని చెబుతున్నారు పండితులు. మరి ఇంతకీ ఇంట్లో ఎలాంటి దీపం వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పుడు చెప్పబోయే దీపాన్ని ఇంటికి ఉత్తరం వైపున వెలిగించాలని చెబుతున్నారు.

ఇలా వరుసగా 21 రోజులు చేయాలట. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే డబ్బు సమస్యకు పరిష్కారం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో శాంతి కోసం ప్రతిరోజూ ఇంట్లో ఏ చిన్న సమస్యకైనా గొడవలు జరుగుతూనే ఉంటే,మిగిలిన ఇంటి సభ్యులతో సంబంధాలు కూడా చెడిపోతున్నట్లయితే ఇంటికి పడమర దిక్కున దీపం వెలిగిస్తే కొద్ది రోజుల్లోనే ఇంటిలో శాంతి నెలకొంటుందట. అకస్మాత్తుగా సంక్షోభం జీవితంలో అకస్మాత్తుగా పోలీసు ఇబ్బందులు, వ్యాజ్యం లేదా మరేదైనా సమస్య వచ్చినట్లయితే ఇంటికి దక్షిణం వైపున దీపం వెలిగించాలని ఇలా చేస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చు అని చెబుతున్నారు. త్వరగా సమస్య నుండి బయటపడవచ్చట.

అలాగే ఏదైనా కోరికను నెరవేర్చడానికి ఏదైనా పని ఎక్కువ కాలం నిలిచిపోయినా లేదా మనసులోని గుప్తమైన కోరిక తీరాలంటే ఇంటి తూర్పు దిక్కున 21 రోజులు పాటు దీపాన్ని వెలిగించాలట. ఇలా పైన చెప్పిన విధంగా మీరు ఏ సమస్యలతో బాధపడుతుంటే ఆయా సమస్యల దీపాన్ని వెలిగించడం వల్ల త్వరగా సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ దిక్కున దీపం వెలిగించినా కూడా 21 రోజులపాటు దీపాన్ని వెలిగించడం మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 31 Jan 2025, 07:00 PM IST