ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కల అన్నది తప్పనిసరిగా ఉంటుంది. సొంత ఇంటిని అలా కట్టించుకోవాలి ఇలా నిర్మించుకోవాలి అని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. ఈ కలను సహకారం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడడంతో పాటు అనేక రకాల పూజలు పరిహారాలు వాస్త నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు సొంత ఇంటి కల అన్నది కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే మీరు కూడా సొంతింటి కల నెరవేరాలి అంటే తప్పకుండా ఈ పరిహారం పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారం పాటించాలి అన్న విషయానికి వస్తే.. కాగా గృహం అనేది పరమేశ్వరుడు ప్రసాదించే అపూర్వ అనుగ్రహం.
ప్రతిఒక్కరూ ఈ అపూర్వ అనుగ్రహాన్ని పొంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ, నెల, వారం ఏ రోజు అయినా పర్వాలేదు. కొద్దిగా వెండిని కొని దానిని చిన్న ఇటుక మాదిరిగా తయారు చేయించుకోవాలి. తర్వాత ఆ వెండి ఇటుక ముక్కను ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అనంతరం ఇంటికి వచ్చాక స్నానం ఆచరించి శుభ్రంగా రెడీ అయి పూజా మందిరంలో మీరు తయారు చేయించిన వెండి ఇటుకను పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. ఆపై దీపారాధన చేసి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర సహస్రనామాన్ని జపించాలి. తర్వాత ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేసి దూపదీప, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
ఈ విధంగా పూజలు నిర్వహించాక తర్వాత రోజు ఆ వెండి ఇటుకను జేబులో లేదా మనీ పర్సులో ఒకరోజు పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు దాన్ని తీసి బీరువాలో దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల తప్పనిసరిగా ఆ వెండి ఇటుక ప్రభావం చేత త్వరలోనే మీకు అద్వితీయమైనటువంటి గృహయోగ ప్రాప్తి కలుగుతుందని, మీ కోరిక ఫలిస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు మరొక పరిహారం విషయానికి వస్తే.. ప్రతి సోమవారం రోజు ఇంటి గృహిణి పరమేశ్వరుడికి జాజిపూల దండను అలంకరించి పూజ చేసి ఇలా ప్రార్థించడం మంచి ఫలితం ఉంటుందట. స్వామి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు నూతన గృహ యోగ ప్రాప్తిని కలిగించు అంటూ కోరుకున్నా కూడా కొత్త గృహ యోగం సిద్ధిస్తుందని చెబుతున్నారు.