Site icon HashtagU Telugu

TTD: తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు షురూ.. ఏయే పూజలు జరుగుతాయంటే!

Ttd

Ttd

TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహింపబడినట్లు ఆలయ అధికారులు చెప్పారు. సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆనందాలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజసామగ్రిని శుద్ధి చేశారు.

ఇప్పటికే ఉత్సవాల్లో భాగంగా  ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలీ గడ్డ , కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

Exit mobile version