Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

Venkateswara Swamy: తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇప్పుడు చెప్పబోయే పనిని తప్పకుండా చేయాలని, లేదంటే మీరు తిరుమల కి వెళ్లినా కూడా వెళ్లనట్టే అని చెబుతున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Images

Images

Venkateswara Swamy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. నిత్యం లక్షలాది మంది భక్తులు ఆయనను దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నిత్యం కోట్లలో డబ్బులు వస్తూ ఉంటుంది. ఇకపోతే శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణ మార్గంలో ఉన్న విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోకుంటే తిరుమల యాత్ర అసంపూర్ణమే అని అంటున్నారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం.

‎తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయమైన ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహమే విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం. ఆనంద నిలయంలోని ధ్రువ మూర్తికి ఉన్న మహాత్యమే విమాన వేంకటేశ్వర స్వామికి కూడా ఉంటుందని అని అంటారు. అయితే ఏ కారణం చేతనైనా శ్రీవారి దర్శన భాగ్యం లభించని వారు విమాన వేంకటేశ్వర స్వామిని దర్శిస్తే శ్రీవారిని దర్శించిన ఫలితమే లభిస్తుందని చెబుతున్నారు.

‎తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ విమానంపై, వాయవ్య దిక్కున ఒక చిన్న మందిరం వెలుగును విరజిమ్ముతు ప్రకాశిస్తూ ఉంటుంది. వెండి మకరతోరణంతో అలంకరించిన ఆ మందిరంలో శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్నారు.

‎‎విమాన వేంకటేశ్వర స్వామికి ఎడమవైపు గరుత్మంతుడు, కుడివైపున హనుమంతుడు సేవ చేస్తూ ఉంటారు. కాగా ఈ విమాన వేంకటేశ్వర స్వామి వారు స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తిని పోలిన రూపంలో, ఎంతో పవిత్రత కలిగి ఉండడం విశేషం. ఈ స్వామి విమానంపై విరాజిల్లుతున్నందునే ఈయన్ను విమాన వేంకటేశ్వరుడు అని చెబుతారు. విమాన వేంకటేశ్వర స్వామి వారి దర్శనం, గర్భాలయంలోని స్వయంభూ శ్రీవారి దర్శనంతో సమానమనే విశ్వాసం బలంగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించిన తరువాత విమాన వేంకటేశ్వరుని కూడా దర్శించుకుంటే జన్మాంతర పాపాలు తొలగిపోతాయని, సర్వశుభాల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే విమాన వేంకటేశ్వరస్వామి దర్శనానికి అంతటి ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు.

  Last Updated: 21 Oct 2025, 08:13 AM IST