Site icon HashtagU Telugu

Tirumala Darshan Tickets: అక్టోబర్ 21న తిరుమల టిక్కెట్లు..!

Ttd Special Darshan Tickets

Ttd Special Darshan Tickets

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. అలాగే.. నవంబర్ నెల అంగప్రదక్షిణం టిక్కెట్లు అక్టోబర్ 21 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ నెల శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి అని టీటీడీ వివరించింది. భక్తులు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ వెబ్ వెబ్ సైట్ లో ఈ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు సూచించారు.