Tips for wallet: మీ పర్స్ లో ఇలాంటివి పెట్టుకున్నారా.. అయితే ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టడం ఖాయం?

మామూలుగా చాలామంది పర్సులో డబ్బులతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం పర్సులో డబ్బులతో పాటు రకర

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 08:00 PM IST

మామూలుగా చాలామంది పర్సులో డబ్బులతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం పర్సులో డబ్బులతో పాటు రకరకాల పేపర్స్ బిల్లులు అంటూ ఏవేవో పెట్టుకుంటూ ఉంటారు.
అయితే తెలిసీ తెలియక ఏది పడితే అది పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టాల పాలు కావాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి? ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది ఏదైనా కొన్ని తర్వాత బిల్లును పర్సులో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా పెట్టుకుని మరచిపోతుంటారు.

ఫలితంగా పర్సులో జంక్ జమ అవుతుంది. అందుకే ఎప్పుడూ బిల్లులు పర్సులో పెట్టుకోకూడదు. అలా వేస్ట్ పేపర్ పెట్టుకోవడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. పర్సులో డబ్బు నిలవదు అనవసరమైన బిల్లులు, కాగితాలు పర్సులో పెట్టకోకూడదు. ఇది ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. పర్సులో పొరపాటున కూడా జీవించి ఉన్న లేదా చనిపోయిన వ్యక్తి ఫోటోలను అస్సలు పెట్టుకోవద్దు. పర్సులో ఎవరి బొమ్మను పెట్టుకోవద్దు. అంతేకాదు పర్సులో ఏ దేవత చిత్రపటాన్ని కూడా పెట్టుకోవద్దు. ఇలా చిత్రాలు పర్సులో పెట్టుకుంటే దోషాలు కలిగడంతో పాటు అప్పులు కూడా పెరిగిపోతాయి. పర్సులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని నమ్మి పర్సు జేబులో పెట్టుకోవాలి.

పర్సులో డబ్బును అడ్డ దిడ్డంగా మడిచి పెట్టుకోకూడదు. పర్సు తెరచి డబ్బులు అన్ని వరుస క్రమంలో పెట్టుకోవడం మంచిది. ఇలా మడిచి పెట్టుకోవడం వల్ల దోషం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాల బారిన పడతారు. అంతేకాదు నాణేలు, నోట్లు కూడా కలిపి పెట్టవద్దు. కాయిన్స్, నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి. పర్సులో ఎలాంటి కీస్ పెట్టుకోకూడదు. తాళం చెవులు పర్సలో పెట్టుకుంటే అది ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది. అలాగే పొరపాటున కూడా కీ పర్సులో పెట్టుకోకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీని కూడా ఆకర్శిస్తుంది.

చిరిగిన నోట్లను ఎప్పుడూ పర్సులో పెట్టుకోవద్దు. పర్సులో అలాంటి నోటు ఉంటే వెంటనే మార్చుకోవాలి లేదా తీసి పక్కన పెట్టడం మంచిది. జీర్ణమైన పర్సు కూడా వాడకూడదు. పాతదైపోయి చిరిగి పోయిన పర్సును వాడకూడదు. ఇలాంటి పర్సులో లక్ష్మి నిలవదు. కనుక పర్సు చిరిగి పోయిపుడు కొత్త పర్సుకు మారడం మంచిది. కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సులను అలాగే వాడుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. అదేవిధంగా అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడూ కూడా పర్సులో పెట్టుకోకూడదు. ఇలా అప్పు చేసి డబ్బులు పర్సులో పెట్టుకోవడం వల్ల అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు.