వారంలో గురువారం రోజు బృహస్పతికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. గురువారం రోజున సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి, శ్రీమహావిష్ణువు ఇలా చాలామంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. అలాగే గురువారం రోజున పూజలు చేయడం పారాయణం చేయడం, దానధర్మాలు, పరిహారాలు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని అలాగే దేవ గురు అయిన బృహస్పతి స్థానం జాతకంలో బలపడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వివాహ అడ్డంకులు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు.
అంతేకాకుండా దేవగురు బృహస్పతి వైవాహిక ఆనందాన్ని కారణమైన గ్రహంగా చెబుతున్నారు. కాబట్టి గురువారం రోజున సాయంత్రం కొన్ని విధివిధానాలతో విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవడంతో పాటు వ్యాపారంలో నష్టం అలాగే ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందట. మరి పైన చెప్పిన సమస్యలు అన్నీ ఉండకూడదు అంటే గురువారం రోజు విష్ణువును ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. గురువారం రోజు ఉదయం నిద్ర లేచి ముందుగా స్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించాలి.
ఆ తర్వాత ఇల్లు మొత్తం గంగాజలం చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుందట. ఆ తర్వాత ఇంట్లోనే పూజ స్థలంలో శ్రీహరి విష్ణు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలట. ఆపై పసుపు పూల దండ, కొన్ని పువ్వులు సమర్పించాలని చెబుతున్నారు. విష్ణువుకి బియ్యం, అరటిపండుని నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. అలాగే విష్ణువు ముందు స్వచ్ఛమైన దేశీ నెయ్యతో దీపాన్ని వెలిగించాలని, విష్ణువుకు సంబంధించిన విష్ణు స్తుతి, విష్ణు గాయత్రి, విష్ణు అష్టోత్తరం వంటి మంత్రాలను జపించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలని చివరిలో హారతి ఇవ్వాలని, అలాగే బృహస్పతి మంత్ర జపం చేయడం చాలా ముఖ్యం అని ఇలా విష్ణువును ఆరాధించిన రోజు పేదలకు మీకు ఉన్నంతలో దానం చేయడం మంచిదని ఇది మరిన్ని మంచి ఫలితాలను కలిగిస్తుంది అని చెబుతున్నారు.