Sai Baba: సాయిబాబా మీ కోరికలు తీర్చాలంటే గురువారం రోజు ఈ పూజ చేయాల్సిందే?

గురువారం సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు అన్న విషయం తెలిసిందే. సాయిబాబా భక్తులు గురువారం రోజున

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 06:30 AM IST

గురువారం సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు అన్న విషయం తెలిసిందే. సాయిబాబా భక్తులు గురువారం రోజున సాయిబాబాకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించమని సాయిబాబాని వేడుకుంటూ ఉంటారు. అయితే గురువారం రోజున ఈ విధంగా సాయిబాబా పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికల నెరవేరుస్తాడు. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబాకు పూజలు నిర్వహించడంతోపాటు, గురువారం ఉపవాసం ఉండి భక్తితో సాయిబాబాను పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలే నెరవేరిస్తాడు. 19 గురువారాలు ఉపవాసం ఉండి బాబాకు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలు మీకు అందిస్తాడు.

గురువారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి అనంతరం బాబాను ధ్యానంచాలి. సాయిబాబాకు పసుపు రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు రంగు ధరించి ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి. బాబా విగ్రహాన్ని గంగాజలం తో శుభ్రం చేసి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని కప్పాలి. ఆ తర్వాత పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు పెట్టి ధూపం వేసి హారతి ఇవ్వాలి. అనంతరం సాయిబాబా కథలు చదివి వినిపించాలి. ఆ తర్వాత సాయి బాబా కు ప్రసాదంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. అలాగే మీకు ఉన్నంతలో డబ్బులు దానం చేయాలి. గురువారం రోజు సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేయడం మంచిది. అలాగే బాబాకు ఇష్టమైన నైవేద్యంగా పాలకోవా పెట్టడం మరింత మంచిది.

సాయిబాబాకు పూజ చేయడంతో పాటు కనీసం ఐదుగురు పేదలకు అన్నదానం చేయడం మంచిది. సాయిబాబాకు ఎంతో ఇష్టమైన వ్రతాన్ని తొమ్మిది రోజులపాటుచేస్తూ ఉపవాసం ఉండాలి. తొమ్మిదవ రోజు పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని సాయిబాబాని వేడుకోవాలి. సాయిబాబా ను ప్రత్యేకంగా పూజించడంతోపాటుగా పూజించిన తర్వాత చిన్నపిల్లలు ఇంటికి పిలిచి ఆ ప్రసాదాన్ని వారికి పెట్టడం వల్లసాయిబాబాకు ఎంతో ఆనందం కలిగి మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు. అలాగే సాయి వ్రతాన్ని ఖచ్చితంగా 9వారాలు పాటించాలి. ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి,ఆయన గుడికి వెళ్లి ఒక్కసారే భోజనం చేయాలి. ఒకవేళ ఉపవాస సమయంలో స్త్రీలకు రుతుక్రమ సమస్యలు ఉన్నట్లయితే మీరు రెండవ గురువారం ఉపవాసం చేయవచ్చు.