Sai Baba: కోరిన కోరికలు నెరవేరాలి అంటే గురువారం సాయిబాబాను ఇలా పూజించాల్సిందే?

గురువారం సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేక శ్రద్ధలతో పూజిస్తూ

  • Written By:
  • Publish Date - January 5, 2023 / 06:00 AM IST

గురువారం సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేక శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సాయిబాబా ఆలయాలను సందర్శించి విశేష పూజలలో పాల్గొని సాయి బాబా అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సాయిబాబాను కోరిన కోరికలు నెరవేరాలంటే తప్పకుండా గురువారం రోజున కొన్ని రకాల పూజలు చేయాల్సిందే. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం రోజున బ్రహ్మ ముహూర్తంలోని నిద్ర లేచి స్నానం చేసి బాబాను ధ్యానించాలి. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ బాబాను భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పూజ చేయడానికి ముందుగా బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి బాబాకి పసుపు రంగు వస్త్రాన్ని కప్పాలి.

అలాగే బాబానీ పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు, పాలకోవా లాంటివి సమర్పించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత సాయిబాబా కథను చదివి వినిపించాలి. దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెట్టి ఉంటామో ప్రసాదానికి కథ వినిపించిన తర్వాత భక్తులకు పంచి పెట్టాలి. ప్రసాదాన్ని దానం చేయడంతో పాటుగా బీదవారికి తోచినంత సహాయం చేయాలి. మరి ముఖ్యంగా సాయిబాబాకు గురువారం రోజున పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల సాయిబాబా కోరిన కోరికలు నెరవేర్చుతాడు. అంతేకాకుండా బాబాకు ఎంతో ఇష్టమైన పాలకోవాను నైవేద్యంగా పెట్టడం ఇంకా మంచిది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బాబాకు జీవహింస అసలు నచ్చదు. కాబట్టి బాబాను భక్తిశ్రద్ధలతో పూజించి జీవులను హింసించిన ఆ ఫలితం దక్కదు. అలాగే సాయిబాబా అనుగ్రహం పొందడం కోసం భక్తులు తొమ్మిది గురువారాలు పూజ చేయడంతో పాటు ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అయితే పూజ చేసే సమయంలో ఏవైనా తప్పులు జరిగితే బాబాను క్షమించమని కోరుకోవాలి.

అలాగే గురువారం రోజున కనీసం ఐదుగురు పేదలకు అన్నదానం చేయాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. సాయిబాబాను పూజించిన తరువాత చిన్న పిల్లలను ఇంటికి పిలిచి వారికీ ప్రసాదం అందించడం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సాయిబాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టం. సాయిబాబా వ్రతాన్ని ఆచరించినప్పుడు ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి బాబా గుడి దగ్గర ఒక్కసారి భోజనం చేయాలి. అయితే 9 వారాలు కచ్చితంగా పాటించాలి. మధ్యలో మహిళలకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే తర్వాతి వారం నుంచి కంటిన్యూ చేయాలి.