Site icon HashtagU Telugu

‎Thursday Remedies: గురువారం రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. లక్ష్మి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

Thursday Remedies

Thursday Remedies

‎Thursday Remedies: హిందూమతంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా గురువారం రోజు విష్ణుమూర్తిని సాయి బాబాను పూజిస్తూ ఉంటారు. గురువారం రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. మరీ ముఖ్యంగా, ఈ రోజున తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడం వల్ల జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. అందుకే గురువారం తెల్లవారు జామున నిద్రలేచి స్నానం చేయాలి.

‎ఈ రోజున పసుపు రంగులు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అప్పుడు, విష్ణువు ఆచారాల ప్రకారం పూజించి, హారతి ఇవ్వాలి. ఈ గురువారం రోజున పసుపు పూలు, తులసి పూలను కూడా సమర్పించాలి. అలాగే “ఓం నమో భగవతే వాసుదావేయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి వారం చేస్తే జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమౌతాయట. మీరు గనుక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటునట్లయితే గురువారం విష్ణుమూర్తి తులసి ఆకులను సమర్పించాలట. ఇలా చేసే ముందు గురువారం తెల్లవారు జామున స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజించి, ఈ తులసి ఆకులను పూజలో ఉంచాలట. పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆ తులసి ఆకులను శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి, వాటిని మీరు మీ డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచాలట.

‎ఇలా తరచుగా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు. అదేవిధంగా వ్యాపారంలో బాగా లాభాలు కలిసి రావాలని అనుకున్న వారు గురువారం రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలట. లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి పసుపు, కుంకుమతో పూజ చేయాలని, పూజ తర్వాత ఆ పసుపు, కుంకుమలను తీసుకొని వస్త్రంలో కట్టి మీ వ్యాపార స్థలంలో ఉంచాలని, ఇలా చేయడం వల్ల, వ్యాపార సమస్యలన్నీ తీరిపోతాయని వ్యాపారంలో లాభాలు చూడవచ్చు అని చెబుతున్నారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుకున్న వారు గురువారం ఒక కుండ నీటిలో కొంత గంగా జలం, తులసి ఆకులను జోడించాలి. వాటిని పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ నీటిని ఇంట్లో, ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందట. కుటుంబంలో సమస్యలు కూడా తీరిపోతాయని చెబుతున్నారు.

Exit mobile version