Thursday Remedies: గురువారం రోజున పసుపును ఇలా ఉపయోగిస్తే చాలు.. డబ్బే డబ్బు!

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో పసుపు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వా

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 04:35 PM IST

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో పసుపు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత శుభకార్యలను మొదలు పెడుతూ ఉంటారు. అయితే గ్రంథాలలో పసుపు కుంకుమ లక్ష్మీదేవి గృహస్మతి అంశాలుగా వర్ణించారు. కాగా జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి కీల‌క‌ స్థానంలో ఉంటాడు. దేవతలకు అధిపతి అయిన బృహస్పతి రూపంలో ఉన్న గురుడు ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించిన గ్ర‌హంగా పరిగణిస్తారు. కుంకుమ పువ్వు, పసుపును ఉపయోగించి కొన్ని సాధారణ నివారణలు చేస్తే, వ్యక్తి బాధ నుంచి విముక్తి పొందుతాడు. ముఖ్యంగా గురువారం రోజున ఈ పరిహారాలు నివారణలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మరి పసుపుతో గురువారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏ మాసమైనా శుక్ల పక్ష అష్టమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత తూర్పు ముఖంగా కూర్చొని లక్ష్మీదేవిని పూజించాలి. పూజలో పసుపు బంతి పువ్వుని ఉపయోగించడం చాలా మంచిది. లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత, ఆ పసుపు బంతిని మీ అల్మారాలో ఉంచాలి. ఈ రెమెడీతో కెరీర్ చాలా త్వరగా పురోగమిస్తుంది. పసుపు తిలకం నుదుటిపై ధ‌రించ‌డం శుభ ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. అలాగే ప్రతిచోటా విజయం, గౌరవం పొందడానికి ప్రతి గురువారం కుంకుమ తిలకం ధ‌రించాలి.

ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో రూపం, సంపద, గౌరవం పొందుతాడు. దీని ద్వారా దేవతలు ప్రసన్నమై భ‌క్తుల‌ను అన్ని విధాలుగా అనుగ్ర‌హిస్తారు. పసుపును తిలకం రూపంలో విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు దోషాలను తొలగించడానికి ఈ రెండు వస్తువులను ఉపయోగించడం వల్ల ఇంట్లోని అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. పసుపును నీళ్లలో కలిపి రోజూ ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఈ పరిహారంతో ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఫ‌లితంగా లక్ష్మీ దేవి రావడంతో ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువారం పసుపు కొనడం, ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

అయితే ఈ రోజు పసుపు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల భవితవ్యం పాడైపోయి పేదవాడిగా మారతారు. కాబట్టి, ఈ రోజు ఇతరులకు పసుపు ఇవ్వడం వీలైనంత వరకు మానుకోవాలి. వేరొకరి చెడు దృష్టి మీ వైవాహిక జీవితాన్ని, మీ గృహ సంతోషాన్ని క్రమం తప్పకుండా ప్రభావితం చేస్తుందని మీరు గుర్తిస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ ఇంటి ప్రధాన తలుపు వెలుపల పసుపుతో స్వస్తిక్‌ను గీయడం చాలా మంచిది. ఈ పరిష్కారం మీకు ఆనందంతో పాటు అదృష్టం తెస్తుంది.