Site icon HashtagU Telugu

Shani Effects: మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా.. అయితే శని దేవుడు మీ జోలికి కూడా రాడు?

Shani Effects

Shani Effects

జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా జాతకంలో శని దోషాలు లేకుండా ఉండాలని శని దేవుని కోపానికి కారకులు కాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుడు కర్మల ఆధారంగా శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా జాతకంలో శని స్థానం మారినప్పుడు కూడా ప్రతికూల అనుకూలపడతారు లభిస్తాయి..

ఇకపోతే ఆరు అలవాట్లు ఉన్న వారికి శని దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని, అలాగే ఆ ఆరు అలవాట్లు ఉన్నవారిని శని దేవుడు ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టడు అని పండితులు అంటున్నారు. మరి ఎటువంటి అలవాట్లు ఉన్న వారి దేవుడు రాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రావి చెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసే వారికి అలాగే రాగి చెట్లను ఎక్కువగా నాటే వాళ్లకు శని దేవుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మర్రిచెట్టు ముందు ఆవాలని ఉండదు దీపాలు వెలిగించే వారికి కూడా శని దేవుడుఎటువంటి కష్టాలను కలిగించడు. కుక్కలకు సేవ చేసే వారికి కూడా శని దేవుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.

మరీ ముఖ్యంగా నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని ఇంకా సంతోషిస్తాడట. ఆవాల నూనెతో చేసిన రొట్టెలను నల్ల కుక్కలకు పెట్టడం వల్ల శని అటువంటి వారి జోలికి పోడు. దానధర్మాలు చేసే వాళ్ళు పేదలకు సహాయం చేసే వాళ్లకు, కష్టంలో ఉన్న వారిని ఆదుకునే వారికి శని దేవుడు ఎప్పుడు అండగా నిలుస్తాడట. అలా దానధర్మాలు చేసేవారు అంటే శని దేవునికి చాలా ఇష్టం. అలాగే నల్ల సెనగలు,నల్ల నువ్వులు, మినప్పప్పు,నూనె,వంట సామాన్లు, వస్తూ సామాగ్రిని దానం చేసే వారికి శని దేవుడు ప్రసన్నమవుతాడట.

Exit mobile version