Site icon HashtagU Telugu

Birth Date Vs Business : ఈ తేదీల్లో పుట్టినవారు.. వ్యాపారంలో దూసుకుపోతారు !!

Birth Date Vs Business

Birth Date Vs Business

Birth Date Vs Business : మీ పుట్టిన తేదీలోనే చాలా విషయం దాగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మన డేటాఫ్ బర్త్‌లోని అంకెలన్నింటినీ కలిపితే చివరిగా ఒక అంకె వస్తుంది. అది 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఉదా హరణకు మీరు 23వ తేదీన జన్మిస్తే.. 2+3= 5 వస్తుంది. మీరు 10వ తేదీన  జన్మిస్తే.. 1+0= 1 వస్తుంది. మీరు 19వ తేదీన జన్మిస్తే.. 1+9= 10 అవుతుంది.. అంటే 1 +0= 1 వస్తుంది  ఈ విధంగా చివరగా వచ్చే అంకెను బట్టి వివరాలను తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 19, 28, 10వ తేదీల్లో పుట్టే వాళ్లందరికీ ఒకటో సంఖ్యే వస్తుంది. వ్యాపార రంగంలో దూసుకుపోయే వారికి సంబంధించిన లక్కీ పుట్టిన తేదీల వివరాలపై(Birth Date Vs Business) కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

22వ తేదీన పుడితే.. 

కంపెనీలను సక్సెస్ ఫుల్‌గా నడిపించడంలో 22వ తేదీన పుట్టినవాళ్లు దిట్టలు. వీరి పనితీరు, పంక్చువాలిటీ అద్భుతంగా ఉంటుంది.  ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన వెనుకడుగు వేయకపోవడం వీరి నైజం. పనులను పెండింగులో ఉంచడం వీరికి ఇష్టముండదు. ఆర్కిటెక్చర్ రంగంలోనూ వీరు బాగా రాణిస్తారు. గొప్ప రియల్ ఎస్టేట్ బిల్డర్లుగా సత్తా చాటుకుంటారు. 22వ సంఖ్య 4, 11 సంఖ్యల లక్షణాలను మిళితం చేస్తుంది.

11వ తేదీన పుడితే.. 

11వ తేదీన పుట్టే వాళ్లు చాలా క్రియేటివ్‌గా ఉంటారని చెబుతుంటారు. ఈ డేట్‌లో పుట్టే వాళ్లు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారట. సరికొత్త ఆవిష్కరణలు చేయాలనే ఉత్సాహం వీరిలో నిత్యం జ్వలిస్తూ ఉంటుంది.  వ్యాపార రంగంలోనూ బాగా రాణించగలుగుతారు. ఈవిషయంలో వీరు ఇతరులకు రోల్ మోడల్‌గా నిలుస్తారు.

Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై మూడు రౌండ్ల కాల్పులు

1వ తేదీన పుడితే..

1వ తేదీన పుట్టే వాళ్లకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వారికి సున్నిత స్వభావం ఉంటుంది. మాట తీరు అట్రాక్టివ్‌గా ఉంటుంది. తమ అభిప్రాయాలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు. జీవితంలో చాలా విషయాల్లో అందరికంటే ముందజలో ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా .. వాటిని అధిగమించే ప్రణాళికను రచించడంలో వీరు దిట్టలు.

8వ తేదీన పుడితే..

8వ తేదీన జన్మించేవారు సంపాదనలో దూసుకుపోతారు. వీరికి డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. డబ్బు కొరత అనే సమస్యే ఎదురు కాదు. వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. ఈ తేదీలో జన్మించిన వారి వ్యాపార సామర్థ్యాల వల్లే ఇవన్నీచేకూరుతాయి. వ్యాపార ప్రణాళికలను వీరు బాగా రచిస్తారు. వినూత్నమైన మార్కెటింగ్ నైపుణ్యాలు వీరి సొంతం.

Also Read :Iran Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. డ్రోన్లు, మిస్సైళ్లతో అర్ధరాత్రి ఎటాక్

గమనిక: ఇవి సంఖ్యా శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు. వీటిపై తుది నిర్ణయం పాఠకులదే. మాకు సంబంధం లేదు.

Exit mobile version