Site icon HashtagU Telugu

Avoid Poverty Vastu Tipsఈ అలవాట్లు ఉంటే ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానించినట్టే.. అవేంటంటే?

Vastu Tips

Vastu Tips

సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ఆనందం, శాంతి ఉన్నవి ఇంట్లో ఉండే సానుకూల శక్తిపై ఆధారపడి ఉంటాయి. మామూలుగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, లేదంటే దరిద్రం తాండవ ఆడుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి సరైన వాస్తు లేకపోతే ఎంత కష్టపడినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఇలా వాస్తు లేని ఇంట్లో వాస్తు దోషాలు కలిగిన ఇంటిలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులే మన ఆర్థిక సమస్యలకు, మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం అవుతూ ఉంటాయి.

అయితే మనం కొన్ని రకాల అలవాట్లను మానుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. మరి ఎటువంటి అలవాట్లను మానుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో ఎప్పుడు కూడా బీరువా పక్కన చీపురు ఉండకూడదు. బీరువా పక్కన చీపురు పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అలాగే ఇంట్లో ఎక్కడ కూడా మూలల్లో మురికి ఉండకూడదు. మరి ముఖ్యంగా ఈశాన్యం మూలలో చెత్తాచెదారం అస్సలు ఉండకూడదు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇంకేంటి కదా అందుకు ద్వారం వద్ద చెత్త డబ్బాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

ఇంట్లోని బాత్రూంల తలుపులు తరచుగా తెరిచి ఉంటే వర్తక వ్యాపారాలలో నిరంతర నష్టం వస్తూనే ఉంటుంది. పడక గదిలో పూజ మందిరం ఉంటే అది కుటుంబంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. అదేవిధంగా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే ఇంట్లో శాంతి, సామరస్యాలకు భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యుల పై అప్పుల భారం పెరుగుతుంది.

Exit mobile version