Site icon HashtagU Telugu

Saturday Remedies: శనివారం సాయంత్రం ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు.. ధనవంతులవ్వడం కాయం?

Saturday Remedies

Saturday Remedies

శనీశ్వరుడు.. చాలామంది ఈ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. ఇంకొందరు అయితే శనీశ్వరుని పూజించాలి అన్న శనీశ్వరుని గుడి కి వెళ్ళాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి శని దేవుడు కర్మ ఫలాన్ని ఇస్తాడు. మంచి పనులు చేసే వారికి శని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే చెడు పనులు చేసే వారికి మరిన్ని కష్టాలను ఇస్తాడు. ఒకవేళ మీపై శని దోషం శని ప్రభావం ఉన్నట్లు అయితే శనివారం రోజున కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి విముక్తిని పొందవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే శని దేవుని కోసం చేసే పరిహారాలు నివారణలు సాయంత్రం సమయంలో చేయడం వల్ల శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించడం వల్ల కష్టాలు తీరిపోయి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అంతేకాకుండా అదృష్టం కూడా మారిపోతుంది. ఇందుకోసం శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల దగ్గర ఉంచాలి. శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి అనంతరం ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం పాటించే ముందు ఎవరికి చెప్పకుండా చేయాలి.

అలాగే శనివారం ఆవనూనెతో శనిదేవుడిని అభిషేకిస్తారు కాబట్టి ఆవనూనెతో చేసే ఏ పరిహారం అయినా శనిదోషంతో సహా అన్ని సమస్యలను తొలగిపోతాయి. శనివారం సూర్యాస్తమయం సమయంలో ఆలయ సమీపంలోని రావిచెట్టు దగ్గర ఆవనూనె దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశబ్దంగా ఇంటికి రావాలి. అయితే ఈ పరిహారం మీ కష్టాలన్నింటినీ దూరం చేయడంతో పాటు మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. అదేవిదంగా ఈ పరిహారం శని ,రాహువుల ఉగ్రతను కూడా తగ్గిస్తుంది. శనిదేవుడు హనుమంతుడిని తన గురువుగా భావిస్తాడు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే హనుమంతునికి నైవేద్యాలు సమర్పించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. దాంతో పాటుగా ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించడంతోపాటు శనీశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

Exit mobile version