Site icon HashtagU Telugu

Turmeric Remedy: పసుపుతో ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షమే?

Turmeric Remedy

Turmeric Remedy

సాధారణంగా ప్రతి ఒక్క వంటింట్లో పసుపు అన్నది కచ్చితంగా ఉంటుంది. పసుపును చాలా వరకు కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే పసుపు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పసుపును ఔషధాల గని అని చెప్పవచ్చు. పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పసుపు కేవలం ఆరోగ్యం అందం విషయంలోనే కాకుండా జీవితంలో కొన్ని రకాల సమస్యలను నివారించడానికి కూడా పసుపు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అలాగే జాతకంలో గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న కూడా పసుపుతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. ఇకపోతే హిందూమతంలో పసుపు విష్ణువు బృహస్పతి గ్రహాలకు సంబంధించినదని నమ్ముతూ ఉంటారు. విష్ణువు గృహస్తి సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి కూడా శుభ ఫలితాలను పొందుతారు. అయితే గురువారం రోజున కొన్ని రకాల నివారణలు పసుపుతో ప్రయత్నించడం వల్ల మంచి జరుగుతుంది. అందుకోసమే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి బయటి గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అలాగే గురువారం రోజున పసుపు రేఖను గీస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న వ్యక్తి గురువారం నాడు విష్ణువు, గురువు బృహస్పతిని పూజించాలి. పూజ అనంతరం, మణికట్టు మెడపై పసుపుతో చిన్న గీత రాయండి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం బలపడుతుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందాలంటే గురువారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలపండి. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి