సహదేవి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. సిటీలలో ఉండే వారికి ఈ చెట్టు గురించి అంతగా తెలియకపోయినా పల్లెటూర్లలో ఉండేవారు ఈ చెట్టును చూసే ఉంటారు. రోడ్ల పక్కన పొలాల దగ్గర ఈ మొక్కలు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. కానీ చాలామంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటారు. ఈ సహదేవి చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చెట్టుకు రెండు రకాల పువ్వులు కూడా పోస్తుంటాయి. అందులో ఒకటి ఎరుపు రంగు పువ్వులు మరొకటి పసుపు రంగు పువ్వులు.
ఏదైనా ఒక శుభదినం రోజున సహదేవి చెట్టు దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి ఆ చెట్టుకు ప్రదర్శనలు చేసి ఆ చెట్టుకు ఉత్తరం వైపు ఉన్న ఒక వేరుని తీసుకోవాలి. ఆ తర్వాత దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్లి అదేవిధంగా ఉత్తరం వైపు ఉన్న వేరును తీసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ రెండు వేళ్ళను ముందుగా కడిగి ఒక తాయత్తు తీసుకొని అందులో ఈ వేర్లను గంధం పచ్చ కర్పూరం వేసి ఒక ఎర్రటి దారానికి కట్టాలి. ఇలా కట్టిన ఈ తాయత్తును కుడి చేతికి కట్టుకోవాలట. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు పండితులు.
అలాగే మీకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని, అప్పులు తీరిపోతాయని, ఎలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడతారని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. చాతుర్మాసంలో శ్రీమన్నారాయణిడికి భక్తి శ్రద్ధలతో పూజించాలి. స్వామి వారి ఆలయానికి వెళ్లి పూజలు, అర్చన చేయించి, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదించాలి. ఆ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తుండాలి. ఆ స్వామిని ధ్యానం చేస్తూనే జాగారం చేయాలి. ఇలా చేయటం వల్ల అనేక జన్మల పాపం తొలగిపోతుందని అంటున్నారు. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ రాసి మామిడి తోరణాలు, పూలతో అలంకరించాలి. ఇలా చేసిన ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా వుంటాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి కూడా ప్రవేశించదని చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందట. కుటుంబంలో వున్న అన్ని ఆర్థిక సమస్యలను తీరుస్తుందని చెబుతున్నారు పండితులు.