Site icon HashtagU Telugu

Ramgiri Fort : సీతారాములు న‌డ‌యాడిన కొండ… ఈ రామ‌గిరి ఖిల్లా…

Ramgiri Fort... The Hill Where Sitaram Walked...

Ramgiri Fort... The Hill Where Sitaram Walked...

Ramgiri Fort : ఇదిగిదిగో నా రాముడు ఈడ‌నే కొలువుండినాడు.. ముద్దుల సీత‌తో ఈడ‌నే మురిపాల‌నాడినాడు అని శ్రీ‌రామదాసు చిత్రంలో శ‌బ‌రి పాడిన పాట అంద‌రికీ గుర్తే ఉంటుంది. ఆ పాట‌లో చెప్పిన‌ట్లుగా సీతారాములు అర‌ణ్య‌వాసం చేసేట‌ప్పుడు అనేక ప్రాంతాల గుండా సంచ‌రించారు. అందులో ఒక ప్రాంతం ఇప్ప‌డు మ‌న తెలంగాణ‌లో ఉంది. అది కూడా సీతారాములు ల‌క్ష్మ‌ణ స‌మేతంగా ఈ కొండ‌పై సంచ‌రించారని పురాణాలు చెబుతున్నాయి.

ఆ కొండే ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని రామ‌గిరి (Ramgiri) ఖిల్లా… సీతారాముల న‌డ‌యాడిన ఈ కొండ ఇప్ప‌డు రామ‌గిరి ఖిల్లాగా ప్రసిద్ధి చెందింది. రామ‌గిరి ఖిల్లాపై కొలువై ఉన్న శ్రీరాముడిని ద‌ర్శించుకుంటే ఎన్ని క‌ష్టాలైనా తీరిపోతాయ‌ని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల న‌మ్మ‌కం… మ‌రెందుకాల‌స్యం మ‌నం కూడా ఈ సీతారాములు న‌డ‌యాడిన ఈ రామ‌గిరి ఖిల్లాను సంద‌ర్శిద్దాం…

We’re now on WhatsApp. Click to Join.

మూడు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే…

ఈ రామ‌గిరి (Ramgiri) ఖిల్లాపై కొలువై ఉన్న శ్రీ‌రాముడిని ద‌ర్శించుకోవాలంటే అంత సుల‌వైన విష‌యం కాదండి. ఎందుకంటే ఈ కొండ‌ను ఎక్కాలంటే సుమారు 3 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అది కూడా కాలిన‌డ‌క‌నే వెళ్లాలి. ఈ కొండ తెలంగాణ‌లోని పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఉంది. ఇది క్ర‌మేణా రామ‌గిరి (Ramgiri) ఖిల్లాగా అభివృద్ధి చెందింది. పౌరాణికంగానూ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతారాముల విగ్ర‌హాల‌తో పాటు హనుమాన్ విగ్రహం కూడా కొలువై ఉంది. అంతేకాకుండా ఇక్క‌డ నంది విగ్రహం కూడా కొలువై ఉంది.

సీతారాముల విగ్రహాలు..

శ్రీరాముని విగ్రహం ఉన్న ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది తలదాచుకునేలా విశాల‌మైన ప్ర‌దేశం ఉంది. ఈ ప్రాంతాన్ని రాజులపాలనలో రామ‌గిరి (Ramgiri) ప‌ట్ట‌ణం అని పిలిచేవార‌ట‌… రాజుల పాల‌న‌లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అని పిలిచేవార‌ట. ఆ పేరు కాస్తా కాలక్రమేణ బేగంపేటగా మారింది. ఓ గొర్రెల కాపరికి సీతారాములు ఊయల ఊగుతున్నట్లు, ఆ ఊయలను లక్ష్మణుడు, ఆంజనేయుడు ఊపుతున్నట్లు కనిపించారని ఇక్క‌డికొచ్చిన భక్తులు చెబుతుంటారు.

ఆ కాపరి ఆ విషయాన్ని ఊర్లో వాళ్లకు చెప్పి, అందరిని అక్క‌డికి తీసుకెళ్లి చూసాడ‌ట‌. అప్ప‌డు అక్క‌డ సీతారాములు కాదు ఒక పెద్ద బండ క‌నిపించింద‌ని, ఆ బండ‌తో పాటు సీతా రాములు, హనుమాన్‌ విగ్రహాలు కనిపించాయని అక్కడి పూజారులు చెబుతుంటారు. ఇంకా ఇక్క‌డ రామ‌గిరి ఖిల్లాలోని బండ‌రాతిపై రాముని పాదాలు, సీతాదేవి స్నానం ఆచ‌రించిన కొల‌ను ఉన్నాయ‌ట‌.

ఎలా చేరుకోవాలి..?

విమాన మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారికి స‌మీపంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం క‌ల‌దు. ఈ విమానాశ్ర‌యం సుమారు 215 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అక్క‌డి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా రామ‌గిరి ఖిల్లాను చేరుకోవ‌చ్చు. ఇక రైలుమార్గం ద్వారా వెళ్లాల‌నుకునేవారికి పెద్ద‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ రామ‌గిరి ఖిల్లాకు సుమారు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ రైల్వేస్టేష‌న్ న్యూఢీల్లీ – కాజీపేట రైలు మార్గంలో క‌ల‌దు. పెద్ద‌ప‌ల్లిలో దిగి ఆటోలు లేదా బ‌స్సుద్వారా ఖిల్లా చేరుకోవ‌చ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల‌నుకునేవారు మాత్రం క‌రింన‌గ‌ర్ నుంచి, బేగంపేట నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. రామ‌గిరి ఖిల్లా కేవ‌లం శ్రీ‌రాముని భ‌క్తులే కాకుండా, ప్ర‌కృతి ప్రేమికులు కూడా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. ఇక్క‌డి ప‌చ్చ‌ని అందాలు వ‌ర్ష‌కాలంలో మ‌రింత రెట్టింప‌వుతాయి.

Also Read:  Ekambareswarar Temple : కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి..