Site icon HashtagU Telugu

Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచితే డబ్బే డబ్బు.. అవేంటంటే?

Tulsi Leaves Benefits

Tulsi Leaves Benefits

Vastu Tips: ప్రకృతిని పర్యావరణాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంటి ఆవరణ ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల అలాగే ఇంటి మేడ పై కూడా చెట్లను పెంచుతూ ఉంటారు. కొందరు ఇంటి చుట్టూ పూల మొక్కలను నాటి వాటిని చూసి సంతోష పడుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల పర్యావరణం ఆరోగ్యంగా ఉండడంతో పాటు లక్ష్మీదేవి కూడా నీ వెంటే ఉంటుందట. అంతేకాకుండా అటువంటి మొక్కలు పెరిగితే మన సంపద కూడా అదే విధంగా పెరుగుతుందట..

వేపచెట్టు..ఈ వేప చెట్టు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు ప్రకారంగా వేప చెట్టుని శుభప్రదంగా భావిస్తారు. వేప చెట్టును వాయువ్య మూలలో పెంచాలి. వేప చెట్టు పెరగడం వల్ల ఆర్థికంగా కూడా మంచి లాభం ఉంటుంది. అలాగే ఇంట్లో కొబ్బరి చెట్టును నాటడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం పురోగతిని కలిగిస్తుంది. అటువంటి ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉంటాయట. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో స్నేక్ మొక్కను పెంచడం వల్ల ఆనందం ,శ్రేయస్సు పొందవచ్చు. స్నేక్ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీన్ని మీ ఇంటి స్టడీ రూమ్‌లో పడకగదిలో కూడా పెట్టవచ్చు.

వాస్తు శాస్త్రంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీరు ఈశాన్య దిశలో నాటవచ్చు. అలాగే ఇంట్లో లక్షణ మొక్కను నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఆర్థిక పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి సంబంధం ఉంది అని చెబుతూ ఉంటారు. ఈ మొక్కను ఇంటికి తూర్పు లేదా తూర్పు,ఉత్తర దిశలో నాటవచ్చు. అయితే పైన చెప్పిన విధంగా మొక్కలను ఆ దిశలో పెంచుకోవడం వల్ల ఆ మొక్కలు ఎంత బాగా పెరిగితే మన సంపద కూడా ఆ విధంగానే పెరుగుతుందట.

Exit mobile version