ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2023) ఏప్రిల్ 20న సంభవించబోతోంది. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చి భూమిపై తన నీడను పడినప్పుడు, దానిని సూర్యగ్రహణం అంటారు. గ్రంధాలలో సూర్య గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం సమయంలో మన చుట్టూ ఉన్న విషయాలు చాలా ప్రభావితం అవుతాయి. దీని ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది. అదే సమయంలో, కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి, వీరికి సూర్యగ్రహణం చాలా శుభప్రదం. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ ఇప్పటికీ దాని ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులపై అశుభకరంగా ఉంటుంది. కాబట్టి, ఈ రోజు సూర్యగ్రహణం సమయంలో ఏ రాశులవారు అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి సూర్యగ్రహణం అశుభం
1. మేష రాశి
ఈరాశివారికి సూర్యగ్రహణం చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు కూడా ఉండవచ్చు. మీరు కెరీర్‌లో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉంది.
పరిహారం – రోజూ హనుమాన్ చాలీసా పఠించండి
2. కన్యా రాశి
కన్యా రాశి వారు వివాదాల బారిన పడే ఛాన్స్ ఉంది. మీరు కొంచెం సంయమనం పాటించండం ముఖ్యం. తక్కువగా మాట్లాడటం చాలా మంచిది. లేదంటే లేనిపోని అనార్థాలకు దారి అవకాశం ఉంది.
పరిహారం – శివ రక్షా స్తోత్రాన్ని పఠించండి.
3. మకరం:
మకర రాశి వారికి దుబారా ఖర్చు ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. మీరు చేపట్టిన పనులు మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిహారం- ఆవును పూజించండి.
4. సింహ రాశి :
సింహ రాశి వారికి చేసే పనుల శుభ ఫలితాలు పొందడంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు చేపట్టిన కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది.
పరిహారం- ‘ఓం సూర్యాయ నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.