Vastu Tips: ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా వాస్తు ప్రకారం గా మనం ఇంట్లో ఎన్నో రకాల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. అందులో చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల విగ్రహాలు పెట్టుకుం

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 06:51 AM IST

మామూలుగా వాస్తు ప్రకారం గా మనం ఇంట్లో ఎన్నో రకాల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. అందులో చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల పాజిటివ్ ఎనర్జీతో పోల్చుకుంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు తెలిసి తెలియకుండా ఇంట్లో కొన్ని రకాల విగ్రహాలను వస్తువులను పెట్టుకోకూడదని చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల విగ్రహాలను పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో వెండి ఏనుగు విగ్రహాలు కూడా ఒకటి. మరి ఇంట్లో వెండి ఏనుగు గ్రహాలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏనుగు విగ్రహాలకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల పలు వాస్తు దోషాలకు చెక్ పెట్టవచ్చు. వినాయకుడు ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు. ఏనుగు చాలా తెలివైన జీవి. దీర్ఘాయువు కూడా ఎక్కువ. సహనంగా కనిపిస్తూనే అవసరం అయినప్పుడు దాని గంభీరాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇంట్లో వెండి ఏనుగు పెట్టుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుందట. ఇంటి ఉత్తర దిశలో ఒక జత వెండి ఏనుగులను ఉంచితే.. పాజిటివ్ ఎనర్జీ కలగడంతో పాటు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాదు వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి లభిస్తుంది. అలాగే పిల్లలు చదువుకునే గదిలో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచితే పిల్లలకు చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుందని, విజయం కూడా లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగులను ఉంచడం చాలా మంచిది. బెడ్ రూమ్‌లో ఏనుగు విగ్రహాలను ఉంచితే.. భార్య భర్తల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. దంపతులు దాంపత్యం కూడా దృఢంగా మారుతుంది అని నమ్మకం. అయితే ఏనుగు విగ్రహాన్ని ఉంచిన దిశ ప్రకారం.. ఇంటిపై పడే ప్రభావం మారుతుంది.