Lord Rama: రామ నామం వెనుక ఉన్న మహిమ ఇదే

  • Written By:
  • Updated On - January 21, 2024 / 12:54 PM IST

Lord Rama: శ్రీరామ నామం జపిస్తే ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. సీతమ్మ తల్లి లంకలో ఉన్నదని ఆంజనేయుడు కనుగొని వచ్చిన తరువాత లంకపై దండెత్తడానికి సుగ్రీవాదులతో కలిసి రామ లక్ష్మణులు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. సముద్ర తీరానికి చేరారు. రాముడితో సహా అందరూ కూర్చొని సముద్రాన్ని దాటేందుకు ఆలోచిస్తున్నారు. అంతలో ఒక వానరుడు రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. అది చూసిన ఆంజనేయునికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది.ఒక పెద్ద బండ రాయి నెత్తి ‘శ్రీరామ’ అంటు సముద్రంలోకి విసిరాడు. అది పైకి తేలింది. దాన్ని చూసి మిగిలిన వానరులు కూడా ‘శ్రీరామ’, ‘శ్రీరామ’ అంటు పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు. రాళ్ళన్నీ నీటిపై తేలుతున్నాయి.

నలుడు, నీలుడు మొదలైనవారు వాటిని క్రమపద్ధతిలో పేరుస్తున్నారు. వారధి తయారవుతోంది. ఇదంతా చూసి ఏంతో సంతోషించాడు రాముడు. తాను కూడా ఒక రాయినెత్తి సముద్రంలోకి విసిరాడు. చిత్రంగా అది మునిగిపోయింది. నివ్వెరపోయాడు నీలమేఘశ్యాముడు. అది చూసి ఆంజనేయుడు రాముని వద్దకు వచ్చాడు. ‘నీవెందుకు విసిరావు రామా?’ అని ప్రశ్నించాడు హనుమ. ‘మీకు సహాయం చేద్దామని నావంతు ప్రయత్నం చేసాను’ అన్నాడు రాముడు.

ఆంజనేయుడు నవ్వుతూ ‘రామా! మేమంతా నీ నామాన్ని ఉచ్చరిస్తూ రాళ్ళను వేస్తున్నాం. నీ నామ మహిమతో అవి సాగరంలో తేలుతున్నాయి. రాముణ్ణి స్మరిస్తే ఏదీ మునగదు. అన్నీ తేలతాయి. కానీ, రాముడు విడిచిపెడితే ఏదీ తేలదు. ఖచ్చితంగా మునిగి పోతుంది. అందుకే, నీవు విడిచిన రాయి మునిగిపోయింది. నిన్ను, నీ నామాన్ని పట్టుకున్న వారే గదా స్వామీ ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా ఉంటారు”.