Site icon HashtagU Telugu

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి? ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు?

Akshaya Tritiya

Akshaya Tritiya

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది అనగా 2025లో ఏప్రిల్ 30వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. కాగా అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం. అందుకే ఈ రోజున బంగారంతో పాటు పలు ముఖ్యమైన వస్తువులు కొనడం శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు బంగారు దుకాణాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఈరోజు బంగారు కొనుగోలు చేస్తే చాలా మంచిది అని బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవి, కుబేరుని పూజించి బంగారం కొనడం, ఆస్తులు సాదించడం, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం వంటివి పవిత్రమైన కార్యాలుగా పరిగణిస్తారు. అయితే ఈరోజు కొన్ని రకాల వస్తువులు కొనడం మంచిదని మరికొన్ని కొనుగోలు చేయకూడదు అని చెబుతున్నారు. అవేంటంటే..

ఈరోజున బంగారు కొనుగోలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ రోజున ఇల్లు కొనుగోలు చేస్తే కుబేరుని ఆశీర్వాదంతో ఇంటికి శ్రేయస్సు చేకూరుతుందట. అదేవిధంగా వాహన కొనుగోలుకు కూడా ఈ రోజును శుభముగా భావించాలట. శుభ ముహూర్తం చూసుకుని వాహనం కొంటే అదృష్టం దక్కుతుందట. కాగా లక్ష్మీదేవిని ప్రతినిధించే వెండి నాణెం కొనడం వల్ల సంపద పెరుగుతుందట. లక్ష్మీ తల్లి ముద్ర ఉన్న నాణెం అయితే మరింత శ్రేయస్కరం అని చెబుతున్నారు. కాగా సులభంగా అందుబాటులో ఉండే ఈ వస్తువు ధనసంపదకు చిహ్నంగా నిలుస్తుందట. దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయట. అదేవిధంగా అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావించాలట. కాగా విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఈ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం.ఈ రోజు కొనుగోలు చేయాల్సిన వాటిలో రాగి ఇతడు పాత్రలు కూడా ఒకటి. వీటిని ఈ రోజున కొనడం సౌభాగ్యానికి దారి తీస్తుందట.

ఈ రోజు ఏవి కొనుగోలు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. పదునైన వస్తువులైన కత్తి, బ్లేడ్, సూది, గొడ్డలి మొదలైనవి కొనడం శుభప్రదం కాదట. అలాగే ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కూడా నివారించాలట. ఈరోజు ఇల్లు శుభ్రంగా, ప్రకాశంగా ఉంచాలట. లక్ష్మీదేవి పూజ చేసి దీపారాధన చేయాలని చెబుతున్నారు. లక్ష్మీ మంత్రాలు లేదా స్తోత్రాలను పఠించాలట. దానధర్మాలు చేసి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని, ఇవన్నీ కలిపి అక్షయ తృతీయను శుభఫలితాలతో నింపుతాయని చెబుతున్నారు.