Site icon HashtagU Telugu

Vastu Tips : ఈ విగ్రహం ఇంటి వాస్తు సమస్యను పరిష్కరిస్తుంది..!!

Budda

Budda

ప్రతిఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని కోరకుంటారు. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. చాలామంది తమ ఇంట్లో ఎన్నో పూజలు చేస్తుంటారు. కానీ సంతోషకరమైన జీవితంకోసం కష్టడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి నిర్మాణం సరిగ్గా ఉంటే…మీరు సంతోషంగా ఉంటారు. వాస్తుదోషం ఉంటే ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు.

బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. బుద్ధుడి చిత్రంలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే… బుద్ధుని విగ్రహాన్ని సరైన స్థానంలో పెడితే ఇంటి అందం పెరగడంతో పాటు మీ ఇంట్లోని దోషాలన్నీ తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి నెలకొంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇవన్నీ జరగాలంటే బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం.

ఇంటి ద్వారం దగ్గరే ఈ విగ్రహం ఉండనివ్వండి :
బుద్ధుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎక్కడ ఉంచాలో తెలియక చాలామంద తికమకపడతారు. మీరు రక్షా ముద్రలో కూర్చున్న బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తే, దానిని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచండి. ఒక చేతిలో ఆశీర్వాదం, మరొక చేతిలో రక్షణ. బుద్ధుని బొమ్మను నేలపై ఉంచాలి. బుద్ధుని విగ్రహాన్ని భూమి నుండి 3-4 అడుగుల ఎత్తులో ఉండే విధంగా చూడాలి.

కుడివైపుకి వాలిన విగ్రహాన్ని ఉంచండి:
బుద్ధుని విగ్రహం కుడివైపుకి వంగి ఉంటే, ఆ విగ్రహాన్ని గదిలో ఉంచడం ఎంతో మంచిది. ఈ విగ్రహాన్ని పడమర ముఖంగా ఉంచాలి. ఈ బుద్ధుని విగ్రహాన్ని టేబుల్‌పై లేదా షెల్ఫ్‌లో ఉంచండి. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని కలిగిస్తుందని చాలామంది నమ్ముతుంటారు.

ధ్యాన ముద్ర విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి:
బుద్ధ భగవానుడి ధ్యాన ముద్ర భంగిమ చాలా ప్రసిద్ధి చెందింది. మీ ఇంట్లో ధ్యాన ముద్రలో భగవంతుని విగ్రహం ఉంటే, మీరు దానిని ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ప్రతిష్టించాలి. అంతేకాకుండా, చాలా మంది ప్రజలు దేవుని ఇంట్లో ధ్యాన ముద్రలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచుతారు. ఇది దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. బుద్ధుని చిత్రం సానుకూల శక్తిని పెంచుతుంది. మనసును ప్రశాంతపరుస్తుంది. బుద్ధుని విగ్రహాన్ని దేవుని ఇంటిలో తూర్పు ముఖంగా ఉంచాలి.

పిల్లల గదిలో బుద్ధుని విగ్రహం:
బుద్ధుని ప్రతి భంగిమకు వేరే అర్థం ఉంటుంది. పిల్లల టేబుల్‌పై బుద్ధుడి విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఈ విగ్రహాన్ని తూర్పు ముఖంగా ఉంచండి. ఇది పిల్లల చదువుకు సహాయపడుతుంది. పడుకునే బుద్ధుడు లేదా చిన్న తల బుద్ధుడు లేదా లాఫింగ్ బుద్ధను కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు.