Site icon HashtagU Telugu

Shiva Puja: పొరపాటున కూడా శివుడికి ఈ వస్తువులతో పూజ చేయకండి.. చేసారో?

Shiva Puja

Shiva Puja

హిందువులు ఎక్కువగా పూజించే ఆరాధించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. సోమవారం రోజున పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుని ఆరాధించడం మంచిదే కానీ తులసి తెలియకుండా పూజ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. అలాగే శివుడి పూజలో కొన్ని రకాల వస్తువులు కూడా అస్సలు ఉపయోగించకూడదు.. మరి ఎటువంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే మనం ఎక్కడికి వెళ్లినా కూడా శివుడు మనకు ఎక్కువగా లింగ రూపంలోనే దర్శనం ఇస్తూ ఉంటారు.

మిగతా దేవుళ్ళు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తే శివుడు మాత్రమే మనకు లింగ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే శివుడికి ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు కుంకుమ ఉపయోగించకూడదు. సిందూరాన్ని కూడా ఉపయోగించరాదు. కాబట్టి శివుడికి కుంకుమను అలాగే సింధూరాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు. అలా ఉపయోగించడం ద్వారా లేనిపోని కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు పసుపుని ఉపయోగించకూడదు. అయితే శాస్త్రాల ప్రకారం శివలింగం అనేది పురుష తత్వానికి ప్రతీక. పసుపు అనేది మహిళలకు సంబంధించినది. పరమేశ్వరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణం చెబుతుంటారు.

కాబట్టి శివున్ని పూజించే సమయంలో మీరు పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది. ఆ పూజా ఫలితాన్ని పొందలేరు. శివ పూజలో ఎక్కువగా మనం బిల్వపత్ర ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది బిల్వపత్ర ఆకులతో పాటు తులసి ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ శివుడి పూజలు ఎప్పుడు కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు. దాని వెనుక పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. అదేవిధంగా చాలా మంది శివుడికి శంఖంతో జలాభిషేకం చేస్తుంటారు. కానీ శివలింగానికి మాత్రం అలాంటి నీటిని అర్పించకూడదు. శివ పురాణం ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని చేతిలో మరణించాడు. కాబట్టి శివుడిని పూజించే సమయంలో శంఖంతో నీటిని ఇవ్వడం నిషేధించడమైనది. అందుకే శంఖంతో శివలింగాన్ని పూజించరు. కాబట్టి పొరపాటున కూడా తెలిసి తెలియక ఇలాంటి తప్పులను అస్సలు చేయకండి. ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం కూడా దక్కదు.

Exit mobile version