Site icon HashtagU Telugu

Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులుచేస్తే అంతే సంగతులు?

Sunset

Sunset

సాధారణంగా వాస్తు శాస్త్ర నిపుణులు సూర్యాస్తమయం సమయంలో సూర్యోదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడడంతో పాటు ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అయితే మరి సూర్యాస్తమయం తరువాత కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదు. అలాంటి పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మరి సూర్యాస్తమయం తర్వాత ఇటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి సమయంలో జుట్టును విరబోసుకోకూడదు. అలాగే విరబోసిన జుట్టుతో అలాగే నిద్రపోవడం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తర్వాత తలస్నానం చేయడం జుట్టు దువ్వుకోవడం లాంటివి చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత వాతావరణంలో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. జుట్టు విరబోసుకుని ఉండే స్త్రీలు ఆ శక్తులను ఆకర్షిస్తారట. అందుకే సాయంత్రం సమయంలో జుట్టు విరబోసుకొని నిద్రించడం, విరబోసుకుని తిరగడం లాంటివి చేయకూడదు. అలాగే రాత్రి భోజనం తర్వాత వంట గదిలో ఎంగిలి పాత్రులను ఉంచకూడదు. వంటగది వాతావరణం మురికిగా ఉండే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

అందుకే వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి నిద్రకు ముందే వంటగదిని శుభ్రం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు,ఉప్పు,పంచదార వంటి తెల్ల పదార్థాలు దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందట. దాంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చీకటి పడిన తర్వాత గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి సమయంలో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం లాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి గౌరవానికి భంగం కలిగి ఆమె అలిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

Exit mobile version