Site icon HashtagU Telugu

Spiritual: దేవుడి దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే జాగ్రత్త!

Spiritual

Spiritual

మామూలుగా మనం పూజ విషయంలో అలాగే పూజగది విషయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వాటిలో దేవుడి గదిలో దేవుడి దగ్గర కొన్ని రకాల వస్తువులు పెట్టడం కూడా ఒకటి. కొన్ని కొన్ని వస్తువులను దేవుడి గదిలో అసలు పెట్టకూడదని చెబుతున్నారు. మరి పూజ గదిలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో ఎల్లప్పుడూ పూజగది ఈశాన్య దిక్కున ఉండాలి. పూజ చేసేవారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి.

దక్షిణం లేదా పడమట వైపు ఉండటం అసలు మంచిది కాదని చెబుతున్నారు. పూజలో వాడినా పూజా ద్రవ్యాలు, పూలు మరుసటి రోజు తప్పనిసరిగా తీసివేయాలి. వీటిని నైర్మల్యం అంటారు ఈ నైర్మల్యాన్ని చెత్తలో వేయకూడదు. వీటన్నిటిని సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలో వదిలేయాలని పోతున్నారు. దీపం వెలిగించే వత్తి పూర్తిగా కాలే వరకు వెలిగేలాగా చూడాలని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే అదే దీపాన్ని మళ్ళీ వెలిగించకూడదట. ప్రతిరోజు దీపం కుందులని శుభ్రం చేయాలని అలాగే దేవునికి సమర్పించిన ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించాలని చెబుతున్నారు.

కొంతమంది దేవుడికి నైవేద్యం సమర్పించి తర్వాత వాటిని తినడం మర్చిపోతారు. అలా చేస్తే దైవ ప్రసాదాన్ని చులకన చేసినట్టు అవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పూజ గదిలో ఎప్పుడూ విరిగిపోయిన విగ్రహాలు పగిలిపోయిన ఫోటోలు ఉండకూడదట. చిరిగిపోయిన లేదా జీర్ణమైన పూజ పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసివేసి ప్రవహించే నీటిలో వదిలేయాలని, అక్షింతల కోసం ఎప్పుడూ నూకల బియ్యాన్ని వాడకూడదని చెబుతున్నారు. అలాగే పూజ గదిలో చనిపోయిన వారి చిత్రాలు కూడా ఉండకూడదట. దీనివల్ల ఆ శుభాలు జరుగుతాయి. అలాగే రౌద్రరూపంలో ఉండే దేవి లేదా దేవునికి సంబంధించిన చిత్రపటాలు పూజ గదిలో ఉండకూడదు వీటివల్ల ఇంట్లో అనిస్థితి పెరుగుతుందని చెబుతున్నారు.