Site icon HashtagU Telugu

Pooja Tips: వాడిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 23 Jun 2024 02 28 Pm 2911

Mixcollage 23 Jun 2024 02 28 Pm 2911

ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధమైన పుష్పాలతో అలంకరించి మరీ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇక పండుగ లాంటి ప్రత్యేక దినాలలో అయితే రకరకాల పూలతో దేవుళ్ళను బాగా అలంకరించి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రీతి అని చెప్పి ఎక్కడెక్కడ నుంచో తీసుకువచ్చి మరి దేవతలకి సమర్పిస్తాము. ఒక్కొక్కసారి ఆ పువ్వులు ఎక్కువగా తీసుకువచ్చి వాడి పోతున్నా కూడా నాలుగు ఐదు రోజుల తర్వాత ఆ పూలతోనే పూజ చేస్తూ ఉంటాము. కానీ అలా చేస్తే మహా పాపం, దరిద్రాన్ని కొని తెచ్చుకోవటమే అంటున్నారు పండితులు.

అలాగే వాడిన పూలతో పూజ చేయడం ఎంత దరిద్రమో మరికొన్ని వస్తువులని మన ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా అంతే దరిద్రం అంటున్నారు. ఒకవేళ పూజ చేయాలి అనుకుంటే ఎప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కోసిన ఫ్రెష్ పూలని లేదంటే మార్కెట్లో అప్పుడే వచ్చిన ఫ్రెష్ పూలను తెచ్చి పూజ చేయడం మంచిది. అలాగే చాలామంది పావురం గోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అలా చేయటం వలన ధన నష్టం జరిగి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అలాగే పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకుంటే దరిద్రాన్ని చేజేతులా ఆహ్వానించినట్లే అవుతుంది అంటున్నారు పండితులు.

కాబట్టి ఎప్పుడైనా సరే అద్దం పగిలిపోయిన వెంటనే దానిని బయటకు పారేయడం మంచిది. లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఆకులు వాడిపోతుంటే వెంట వెంటనే తొలగించాలి. ఎండిన ఆకులని అలాగే ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లు అవుతుంది. అదేవిధంగా పూజ చేసేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించాలి. నిత్యం దేవుడి గదిని శుభ్రం చేయడం వాడిపోయిన పూలను తొలగించడం చేయాలి. మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది. నిజానికి ఇలాంటి వాటిని నేటి తరంవారు మూఢనమ్మకాలు అనే పొట్టి పారేస్తున్నారు కానీ పెద్దవారు చెప్పే ప్రతి విషయం వెనుక ఏదో పరమార్థం ఉంది.