Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మిదేవికి వీటిని సమర్పిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!

Lakshmi Devi

Lakshmi Devi

ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అందుకోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగింది అంటే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడంతో పాటు ధనానికి లోటు ఉండదని భావిస్తారు. అలాగే మనం చేసే కొన్ని రకాల పనులను బట్టి కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. ముఖ్యంగా ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదు అనుకుంటే అమ్మవారికి కొన్నింటిని సమర్పించాలని చెబుతున్నారు. మరి లక్ష్మీదేవికి ఎలాంటివి సమర్పిస్తే సంతోషిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా లక్ష్మీదేవి చంచల స్వభావము కలిగి ఉంటుందని అంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదు. లక్ష్మి అలాగే అమ్మవారు ఎక్కడ అయితే పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది. మురికిగా ఉండే ఇళ్లలో నివసించడానికి అస్సలు ఇష్టపడదు. అలా మురికిగా ఉన్న ప్రదేశాలలో ఎలాంటి పూజలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థమే అని చెబుతున్నారు. ఇకపోతే లక్ష్మీదేవికి ఎలాంటివి సమర్పించాలి అన్న విషయాన్ని వస్తే..

తామర పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే తామర పువ్వులనే కాకుండా తామర విత్తనాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. తామర గింజలను మాలగా కూర్చి అమ్ముతుంటారు. తామర గింజల మాలను లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. జీవితంలో సంతోషం, ఆనందం, శాంతి మొదలైనవాటిని ప్రసాదిస్తుందని చెబుతున్నారు.. జీవితంలో పురోగతి లేదు అనుకున్న వారు తామర గింజలను హారాన్ని కట్టి లక్ష్మీదేవికి సమర్పించాలట. ఇలా చేస్తే ఆర్థిక రాబడి కోసం అవకాశాలు పెరుగుతాయట. అలాగే పనులలో ఆటంకాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పనులలో విజయం సాధించాలని అనుకునేవారు తామర గింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల చేయబోయే పనులలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయట.

లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజల మాలను సమర్పించడమే కాకుండా ఆ తామరగింజల మాలతో లక్ష్మీదేవి జపం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. తామర గింజల మాలను సమర్పించడంతో పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఎర్రటి గుడ్డలో నాణేలు పెట్టి దానిని మూటగా కట్టి అమ్మవారికి సమర్పించవచ్చని చెబుతున్నారు. లక్ష్మీదేవికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ శుక్రవారం పూజ సమయంలో పచ్చ కర్పూరాన్ని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయట. ఇది ఉదయం లేదా సాయంత్రం పూజలో ఎప్పుడైనా చేయవచ్చని చెబుతున్నారు. కలకండ అంటే పటిక బెల్లంని ఇంట్లో పూజలో దేవుడి నైవేద్యంగా బెల్లం ముక్కను ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి పూజలో కలకండ ముక్కను నైవేద్యంగా ఉంచాలట. ఇలా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట.