Mahalaya Amavasya 2023 : మహాలయ అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజున ఏం చేయాలి ?

కృష్ణ పక్షానికి ఒకసారి వచ్చేది అమావాస్య. మహాలయ అమావాస్య మాత్రం ఏడాదికి ఒకసారి వస్తుంది. మహాలయ అమావాస్య అంటే ఏంటి ? ఆ రోజున ఏం చేయాలి ? అని చాలా మందికి సందేహం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 10:13 PM IST

Mahalaya Amavasya 2023 : సాధారణంగా అమావాస్య అంటే.. ఆ రోజు మంచిది కాదని అనుకుంటూ ఉంటారు. అమావాస్య రోజున ఎలాంటి పనులు ప్రారంభించకూడదు అనుకుంటారు. కొందరైతే అమావాస్య రోజున అసలు ఇంటి గడప దాటి బయటకు కూడా వెళ్లరు. ఇంకొందరికి అమావాస్య రోజు ఖచ్చితంగా ఏదొక గొడవ జరుగుతుందన్న అపనమ్మకాలుంటాయి. కానీ.. కొన్నిరాష్ట్రాల్లో అమావాస్యను మంచిరోజుగా భావిస్తారు. కృష్ణ పక్షానికి ఒకసారి వచ్చేది అమావాస్య. మహాలయ అమావాస్య మాత్రం ఏడాదికి ఒకసారి వస్తుంది. మహాలయ అమావాస్య అంటే ఏంటి ? ఆ రోజున ఏం చేయాలి ? అని చాలా మందికి సందేహం ఉంటుంది.

మహాలయ అమావాస్య రోజు చేయాల్సిన పనుల గురించి, దాని విశిష్టత గురించి ప్రముఖ ప్రవచన కర్త సామవేదం షణ్ముఖ శర్మ ట్వీట్ చేశారు.

“ప్రతినెల కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య. మహాలయ అమావాస్య ఏడాదికొకసారి వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుందని శాస్త్ర వాక్యం. కాబట్టి అమావాస్య కూడా మంచి దినమే. దక్షిణాదిలో సౌరపంచాంగం ప్రకారం దీన్ని ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు. కాలప్రభావం వల్ల కొన్ని అపోహలు ఏర్పడి అమావాస్యకు తీరని అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. చీకటి అంటే భయపడే మనిషి తత్వానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని, విజ్ఞానపుంజం ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని వేదం చెబుతోంది. మరి కాస్త లోతుగా పరిశీలిస్తే, అమావాస్యకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.”

“అ+మ+వాస= అ అంటే అర్కుడు లేక సూర్యుడు. మ అంటే చంద్రుడు. అంటే, సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకేచోట నివసించే రోజు కాబట్టి అమావాస్య అన్న పేరు సార్ధకం అయింది. కొంతమంది ఈ అపురూప సంఘటనను స్వార్థం కోసం వాడుకోవచ్చు. మంత్రతంత్రాలు ఉపయోగించి కొన్ని క్షుద్రశక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి యత్నిస్తారని అంటారు. అంత మాత్రాన అమావాస్యకు దోషం ఆపాదించటం తగదు. లయం అంటే ఆలింగనం, కలిసిపోవటం, విశ్రమించటం, కరిగిపోవడం. పరమాత్మ జీవాత్మల సంయోగానికి, సంగమానికి అది సంకేతం.” అని పేర్కొన్నారు. కాబట్టి మహాలయ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు.

Also Read : Lord Krishna – Arjuna : శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఏం జరిగిందంటే ?