Friday: శుక్రవారం ఈ విధంగా చేస్తే చాలు..పేదరికం పోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం?

మామూలుగా హిందువులు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 10:00 PM IST

మామూలుగా హిందువులు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా కూడా పరిగణిస్తూ ఉంటారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆమె అనుగ్రహం పొందడంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి హృదయపూర్వకంగా పూజ చేయడంతో పాటు ఆ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో మంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున శ్రీ సూక్తం పఠించడం మంచిది. క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పారాయణం చేస్తే శుక్రుని స్థానం బలపడి స్వల్పకాలంలోనే లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు తప్పకుండా తెల్లని దుస్తులు ధరించాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించాలి. తామరపూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాలను దర్శించి, శ్రీ సూక్తం పఠించాలి.

ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు, సంపదలు సులువుగా పెరుగుతాయి. అలాగే ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే, శుక్రవారాల్లో శుభ్రమైన నెయ్యిని ఆలయానికి దానం చేయాలి. అందువల్ల శుక్రుడు బలవంతుడై సంపద శ్రేయస్సుతో జీవించగలడు.అదేవిధంగా మీ పని, వ్యాపారం లేదా మరేదైనా పనిలో ఆటంకాలు ఉంటే, శుక్రవారం నల్ల చీమలకు పంచదార ఇవ్వాలి. శృంగార పక్షి చిత్రాలు ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధంలో సమస్యలు ఉంటే, శుక్రవారం రోజున మీ ఇంట్లోని పడకగదిలో ప్రేమ పక్షుల చిత్రాన్ని ఉంచడం ద్వారా రిలేషన్ షిప్ లో సమస్యలు తొలగిపోయి బంధం బలపడుతుంది. అలాగే శుక్రవారాల్లో తెలుపు గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల చంద్రుడు శాంతించి లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. వీలైతే, అదే రంగు రుమాలు ఉపయోగించడం మంచిది.