Aswamedha Yagam : అవి మూడు మహత్కార్యాలు అశ్వమేధయాగంకు సమానమైనవి.. అవి ఏంటంటే?

సాధారణంగా కొందరు ఎదుటి వ్యక్తి చెప్పే మంచి మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోవడమే కాకుండా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 07:11 AM IST

సాధారణంగా కొందరు ఎదుటి వ్యక్తి చెప్పే మంచి మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోవడమే కాకుండా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక సామాన్య వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఇదేనా మంచి మాటలను చెబితే చెవికి ఎక్కించుకోవడం మానేసి పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు. ఆ సామాన్య వ్యక్తి చెప్పిన మాటలనే ఒక వేదపండితుడు చెబితే ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా ఆలోచిస్తూ ఉంటారు. పండితులు నోటి వెంట వచ్చే మాటలను వినడమే కాకుండా వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇకపోతే వేద పండితుడు అయినా సామాన్య వ్యక్తి అయినా కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తికి హాని కలిగించకూడదు. అతనికి వీలైతే మంచి చేయాలి కానీ అతని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు అని చెబుతూ ఉంటారు. ఇక పోతే అసలు విషయంలోకి వెళితే మనం చేసే కొన్ని పనులు అశ్వమేధయాగంతో సమానమట. ఆ మూడు పనులు చేస్తే అశ్వమేధ యాగం చేసిన అపారమైన పుణ్యం మనకు కలుగుతుందట. మరి ఆ మూడు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటిది దారిద్రం తో బాధపడుతున్న వారికి దానం చేయడం, ఇక రెండవది పూజా పురస్కారాలు లేకుండా శూన్యమైన శివలింగాన్ని తాను పూనుకుని పూజించడం, చివరిగా మూడవది అనాథగా పడిఉన్న శవానికి దహన సంస్కారాలు జరిపించడం. ఈ మూడు మహత్కార్యాలు చేస్తే అవి అశ్వమేధ యాగంతో సమానమైనది. ఈ మూడింటిలో ఏది ఆచరించగలిగినా కూడా అపారమైన పుణ్యం సంప్రాప్తిస్తుంది అని చెప్పబడింది.