Vastu Shastra : భోజనం చేసేటప్పుడు ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు…లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది..!!

హిందూ గ్రంధాల్లో దేవుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నట్లే..భోజనం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 07:00 AM IST

హిందూ గ్రంధాల్లో దేవుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నట్లే..భోజనం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం భోజనం లేదా ఆహారం విషయంలో మనం చేయకూడని తప్పులు ఏమిటి..? తినేటప్పుడు మనం పాటించాల్సిన 3 సాధారణ నియమాలేంటో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం అన్నంను అన్నపూర్ణదేవిగా కొలుస్తుంటాం. ఆహారం పట్ల నిజాయితీ లేకపోవతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. డబ్బు, ఆహార సమస్యలు వస్తాయి. సనాతన ధర్మంలో ప్రతిదీ సరైన మార్గంలో చేయాలన్న నియమాలు ఉన్నాయి. అదేవిధంగా ఆహానికి సంబంధించి కొన్ని నియమాలను గ్రంథాల్లో పేర్కొన్నారు. వాటిని పాటించినట్లయితే ఆహారానికి లోటుండదు. ఆహారం విషయంలో మనం చేయకూడదని తప్పులేంటో తెలుసుకుందాం.

1. గిన్నెలో చేతులు కడుక్కోవడం:
భోజనం చేసిన తర్వాత ప్లేటులో చేతులు కడుక్కునే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది అశుభం. గిన్నెలో చేతులు కడగడం అంటే ఆహారాన్ని అవమానించడమే. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. . తిన్న తర్వాత ఎప్పుడూ కూడా గిన్నెలో చేతులు కడగకూడదు.

2.గిన్నెలో అన్నం వదిలివేయడం:
గిన్నెలో ఎఫ్పుడూ కూడా సగం అన్నం వదిలివేయకూడదు. ఇలా చేస్తే పాపంలో భాగస్వామి అవుతారు. మీరు ఎంత తింటారో అంతమాత్రమే గిన్నెలో పెట్టుకోవాలి. సగం అన్నం తిని మిగతాది వదిలివేయద్దు. ఎందుకంటే గిన్నెలో సగం అన్నం వదిలేస్తే అది వృధా అవుతుంది. ఇలా చేస్తే అన్నపూర్ణదేవి ఆగ్రహిస్తుంది.

3. ఒక గిన్నెలో మూడు చపాతీలు:
ఆహారం వడ్డించే సమయంలో మూడు రోటీలను ఒక గిన్నెలో ఉంచడం అశుభం. ఒక గిన్నెలో మూడు రోటీలు పెట్టడం అంటే..మరణించినవారికి అంకితం చేసినట్లు. చనిపోయిన వ్యక్తికి నైవేద్యంగా ప్లేటులో మూడు చపాతీలు పెడతారు.

ఆహారం విషయంలో గ్రంధాల్లో చెప్పినట్లుగా ఈ మూడు తప్పులు చేస్తే జీవితంలో డబ్బు, ఆహానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవి, లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.