మరో మూడు రోజుల్లో దీపావళి పండుగ రానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే దీపావళి పండుగ వచ్చింది అంటే చాలా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి టపాసులను పిలుస్తూ ఉంటారు. ఈ పండుగను కాంతి, ఆనందం, శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. దీపావళి రోజున ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయడం శుభప్రదమని ప్రజల నమ్మకం. ముఖ్యంగా బంగారం, వెండి, వాహనాలు, పాత్రలు, బట్టలు కొనడం ద్వారా లక్ష్మీదేవి, కుబేరులు ప్రసన్నమవుతారని, ఇంట్లో సంతోషం ఉంటుందని నమ్మకం. ఒకవేళ దీపావళి పండుగ రోజు బంగారం వెండి వాహనాలను కొనుగోలు చేయలేని వారు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
ముఖ్యంగా మూడు రకాల వస్తువులను తప్పకుండా కొనుగోలు చేయాలట. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి అన్న విషయానికి వస్తే.. భీమసేని కర్పూరం.. సాధారణ కర్పూరం ఈ కన్నా గాఢమైన వాసనను కలిగి ఉంటుంది. దీపావళి రోజు దీన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందట. ఈ కర్పూరాన్ని పూజలో ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, సంపద, శ్రేయస్సు ఇంట్లో నిలుస్తాయని చెబుతున్నారు. అలాగే దీపావళి పండుగ రోజు ఇంటికి తీసుకు రావాల్సిన వస్తువులలో నల్ల పసుపు కూడా ఒకటి. ఈ నల్ల పసుపు ఆయుర్వేద అంగళ్లలో లేదంటే వనమూలికల అంగళ్లలో పూజా సామాగ్రి దొరికే స్థలంలో దొరుకుతుంది.
పూజ సమయంలో లక్ష్మీదేవి ముందు నల్ల పసుపు ఉంచి, పూజ అనంతరం దానిని సురక్షితమైన స్థలంలో లేదా డబ్బు వద్ద ఉంచితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయట. అదేవిధంగా దీపావళి రోజున ఎనిమిది కిలోల ఉప్పు కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి కలిగి ఉండటంతో దీపావళి రోజున కొన్న ఉప్పును ఇంటి ముఖ్య ద్వారం వద్ద ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగుతుందని విశ్వసిస్తారు. ఈ దీపావళి పండుగకు ఈ మూడు వస్తువులను కొనుగోలు చేసి, వాటిని సరిగ్గా వినియోగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.